Breaking News

పింఛన్‌ సొమ్ము నుంచే ఇంటి పన్ను వసూళ్లు

Published on Thu, 12/04/2025 - 05:22

తుని రూరల్‌: సామాజిక భద్రతగా అందించాల్సిన పింఛన్ల సొమ్ము నుంచి ఇంటి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వంపై లబ్ధిదారులు తిరుగుబాటు చేశారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. స్థానికుల సమాచారం మేరకు..ఈ నెల 1న కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి స్వామి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ చేపట్టారు. పింఛన్లు పొందుతున్న కొంతమంది నుంచి ఇంటి పన్ను సొమ్ము మినహాయించి మిగతాది ఇచ్చారు. 

ఇంటి పన్ను కట్టకపోతే ప్రభుత్వం పింఛన్‌ నిలిపివేస్తుందన్న భయంతో కొంతమంది ఇంటి పన్ను చెల్లింపునకు అంగీకరించారు. పలివెల దేవుడమ్మ పింఛన్‌ నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తుండగా ఆమె కుమార్తె తీవ్రంగా వ్యతిరేకించి సచివాలయ సర్వేయర్‌ సురేష్‌ను నిలదీసింది. మిగిలిన పింఛన్‌దారులు ఆమెకు మద్దతు పలికారు. దీంతో పింఛన్‌ డబ్బు చెల్లించి సర్వేయర్‌ వెనుతిరిగారు.అలాగే, యండగుడ నూకాలమ్మ నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను రూ.243 మినహాయించుకుని పింఛన్‌ ఇచ్చినట్లు బాధితురాలు చెప్పారు. 

మరికొంతమంది నుంచి పింఛన్‌ డబ్బులోనుంచే ఇంటి పన్నులు మినహాయించుకుని రశీదులు ఇచ్చినట్లు తెలిసింది. కొడుకు ఇంటి పన్ను చెల్లించలేదని అతని తల్లికి పింఛన్‌ 2 రోజులు నిలిపివేసినట్లు ఆరోపించారు. కాగా, ఇంటి పన్నులు గత నెల నుంచీ వసూలు చేస్తున్నామని, కొంతమంది ఒకటో తేదీకి కడతామని చెప్పడంతో అడిగినట్లు సచివాలయ కార్యదర్శి స్వామి తెలిపారు. ఎవరి నుంచీ తమ సిబ్బంది బలవంతంగా ఇంటి పన్నులు వసూలు చేయలేదని, పింఛన్‌ డబ్బు నుంచి మినహాయించుకోలేదని అన్నారు.  

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)