Breaking News

అప్పుల ఊబిలో చంద్రబాబు సర్కారు!

Published on Thu, 01/02/2025 - 06:09

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని రాకెట్‌ వేగంతో అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌బయట ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. ఈ ఒక్క ఆర్ధిక ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు అప్పులు ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటికే మార్కెట్‌ రుణాల కింద చేసిన అప్పులు బడ్జెట్‌లో పేర్కొన్న దానికంటే మించి పోయాయి. బడ్జెట్‌లో రూ.71 వేల కోట్లు మార్కెట్‌ రుణాల ద్వారా అప్పు చేస్తామని పేర్కొంటే.. మంగళవారం చేసిన రూ.5,000 కోట్లతో మార్కెట్‌ రుణాల అప్పు రూ.74,827 కోట్లకు చేరింది. 

ఈ ఆర్థిక ఏడాదిలోనే తాజాగా జనవరి నుంచి మార్చి వరకు మార్కెట్‌ రుణాల ద్వారా మరో రూ.11 వేల కోట్ల అప్పు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే బడ్జెట్‌ లోపల ఒక్క మార్కెట్‌ రుణాల ద్వారానే అప్పులు రూ.85,827 కోట్లకు చేరనున్నాయి. వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో ఏకంగా రూ.14 వేల కోట్లు అప్పు చేస్తుండగా.. మరో పక్క రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యూ సంస్థ ద్వారా ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. 

ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అంటే ఈ ఒక్క ఆర్థిక ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు అప్పులు ఏకంగా రూ.1,30,827 కోట్లకు చేరుతున్నాయి. కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్ధిక ఏడాదిలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పులు చేయలేదు. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసినప్పటికీ సూపర్‌ సిక్స్‌ హామీలను సైతం అమలు చేయడం లేదు. ఇలాంటి చంద్రబాబు సర్కారు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తుండటం గమనార్హం.  


మూడు నెలల మార్కెట్‌ రుణాలకు ఆర్‌బీఐ క్యాలెండర్‌ 
చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మూడు నెలల్లో మరో రూ.11 వేల కోట్ల మార్కెట్‌ రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్‌ రుణాల ద్వారా డిసెంబర్‌ 31 నాటికి రూ.74,827 కోట్లు అప్పు చేసింది. ఈ ఆర్ధిక ఏడాదిలో జనవరి నుంచి మార్చి వరకు మార్కెట్‌ రుణాలు ఏ రాష్ట్రం ఎంత తీసుకుంటుందనే అంశంపై ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది. 



ఈ సంప్రదింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ.11 వేల కోట్ల మేర మార్కెట్‌ రుణాల ద్వారా అప్పు చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐకి చంద్రబాబు సర్కారుతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి నుంచి మార్చి వరకు ఈ తేదీల్లో ఎంత మేర మార్కెట్‌ రుణాల ద్వారా అప్పు చేస్తారో సూచిస్తూ క్యాలెండర్‌ ప్రకటించింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)