Breaking News

ప్రభుత్వ వైద్యానికి ‘నిధి’వంచన

Published on Sun, 07/26/2026 - 06:17

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుదలకు, తగినంత మానవ వనరుల లభ్యత కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా ఆ నిధుల్ని సమర్థంగా ఖర్చుచేయడంలో చంద్రబాబు ప్రభు త్వం ఘోరంగా విఫలమైంది. ముగిసిన (2025–26) ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగా న్ని బలోపేతం చేసేందుకు 15వ ఆర్థిక సంఘం గ్రాంటు రూపంలో రాష్ట్రానికి రూ. 567.40 కోట్లను విడు దల చేసింది. ఈ నిధులతో భవనాలు లేని ఉప ఆరో గ్య కేంద్రాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను,కమ్యు నిటీ ఆరోగ్య కేంద్రాలను నిర్మించాల్సి ఉంది. అలాగే గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు, రోగ నిర్ధారణ మౌలిక సదుపాయాల కోసం, బ్లాక్‌ స్థాయిలో పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్లను బలోపేతం చేయాల్సి ఉంది.

 అయి తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 567.40 కోట్లలో పైసా కూడా చంద్రబాబు ప్రభుత్వం ఖర్చుచేయలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  అలాగే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ ఆరో గ్య మిషన్‌ 2025–26లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.163.40 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వ్యయం చేయాల్సి ఉంది. అయితే 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.17.64 కోట్లను మాత్రమే ఖర్చు చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంటే కేంద్రం కేటా యించిన నిధుల్లో రూ.145.76 కోట్లను రాష్ట్ర ప్రభు త్వం ఖర్చు చేయలేదని స్పష్టం అవుతోంది.  

గత ప్రభుత్వంలో ఆరోగ్యసేవలు బలోపేతం  
గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రభుత్వ రంగంలో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి విశేష కృషి చేసింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా వైద్యశాలల ఆధునికీకరణ పనులను చేపట్టింది. విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణాలను చేపట్టింది. అంతే కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను చేపట్టింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గత ప్రభు త్వం చేపట్టిన పనులను నిలిపివేసింది. మరోవైపు కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిరీ్వర్యం చేసి ప్రైవేట్‌ పరం చేయాలనే కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం అడుగు లు వేస్తోందని దీనినిబట్టి అర్థమవుతోంది. ఇందులో భాగంగానే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను ఆపేసి పీపీపీ(పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌íÙప్‌) పద్ధతిలో ప్రైవేట్‌ పరం చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)