Breaking News

గూగుల్‌తో ఎంవోయూ ఓ రహస్యం!

Published on Sun, 12/07/2025 - 07:37

సాక్షి, విశాఖపట్నం: గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం ముందునుంచీ నిజాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గూగుల్‌తో ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూకి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. ‘ఈ వివరాలు ఇవ్వకూడదు. కాన్ఫిడెన్షియల్‌’ అంటూ సమాధానమివ్వడం చర్చనీయాంశంగా మారింది. 

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు బాబు ప్రభుత్వం చెబుతున్న గూగుల్‌ డేటా సెంటర్‌ ఎంవోయూ వివరాలు ఇవ్వాలంటూ అనకాపల్లి జిల్లాకు చెందిన బుద్దా చక్రధర్‌ గత నెల 4న ఏపీఐఐసీకి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై రాష్ట్ర సచివాలయం అసిస్టెంట్‌ సెక్రటరీ పేరుతో ప్రభుత్వం పోస్టు ద్వారా పంపిన జవాబు శనివారం చక్రధర్‌కు చేరింది. 

‘ఈ ఎంవోయూ వివరాలు చాలా రహస్యంగా ఉంచాలి’ అని స్పష్టంచేసింది. దీనిపై మానవ హక్కుల వేదిక, యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్‌టీఐ క్యాంపెయిన్‌ ప్రతినిధులు మండిపడుతున్నారు. డేటా సెంటర్‌ ఒప్పందాన్ని గేమ్‌చేంజర్‌గా చెబుతున్న ప్రభుత్వం.. అసలు ఎంవోయూ విషయాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎందుకు నిరాకరిస్తోందని ప్రశ్నిస్తున్నారు. 

స.హ.చట్టం ప్రాథమిక సూత్రాల ఉల్లంఘన!
ఎంవోయూ వివరాలు ఇవ్వకుండా సమాచార హక్కు చట్టం–2005 ప్రాథమిక సూత్రాలను చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించినట్లేనని మానవహక్కుల వేదిక ఏపీ, తెలంగాణ కో–ఆరి్డనేషన్‌ కమిటీ సభ్యుడు వీఎస్‌ కృష్ణ, యూఎఫ్‌ఆర్‌టీఐ కో–కన్వీనర్‌ చక్రధర్‌ వ్యాఖ్యానించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)