Breaking News

హార్బర్‌లోనూ ప్రైవేట్‌ పాగా

Published on Sat, 12/13/2025 - 07:01

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మత్స్యకారులు వేట కోసం పొరుగు రాష్ట్రాల­కు వెళ్లి ఇబ్బంది పడకూడదని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫిషింగ్‌ హార్బర్‌లోనూ ప్రైవేట్‌ సంస్థ పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే వైఎస్‌ జగన్‌ నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను పీపీపీ పేరిట ప్రైవేట్‌కు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పుడు షిప్‌యార్డ్‌ నిర్మాణం పేరిట ఫిషింగ్‌ హార్బర్‌లోకి సైతం ప్రైవేట్‌ సంస్థకు రెడ్‌కార్పెట్‌ వేసింది. 

మత్స్యకారుల పొట్ట కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌లో షిప్‌యార్డ్‌ ఏర్పాటు చేసేందుకు 29.58 ఎకరాలను సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌కు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలవేట కోసం  నిర్దేశించిన ఫిషింగ్‌ హార్బర్ల వద్ద షిప్‌యార్డు నిర్మిస్తే మత్స్య సంపదకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

జగన్‌ నిర్మించారు.. చంద్రబాబు ప్రైవేట్‌కు ఇస్తున్నారు
రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. తొలి దశలో రూ.1,522.8 కోట్లతో జువ్వ­ల­దిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్లను అభివృద్ధి చే­సింది. జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు 30న వర్చువల్‌గా ప్రారంభించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం అప్పటి నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను మత్స్యకారులకు అందు­బాటులోకి తీసుకురాలేదు. ఇప్పుడు అక్కడ షిప్‌యార్డ్‌ నిర్మించేందుకు సా­గర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ అనే ప్రైవేట్‌ సంస్థకు 29.58 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇందులో 7.58 ఎకరాలు వాటర్‌ ఫ్రంట్‌ ల్యాండ్, 22 ఎకరాలు హార్బర్‌ ల్యాండ్‌ ఉందని పేర్కొన్నారు. ఇక్కడ సాగర్‌ డిఫెన్స్‌ సంస్థ ఆటానమస్‌ మారిటైమ్‌ షిప్‌యార్డ్, సిస్టమ్స్‌ సెంటర్‌ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మార్కెట్‌ విలువలో 6 శాతం అద్దె చెల్లించే విధంగా ఈ భూమిని కేటాయిస్తున్నట్లు పేర్కొ­న్నారు. ఏటా 5 శాతం చొప్పున లీజు ధరను పెంచుతామని తెలి­పారు. అదే 7.58 ఎకరాల వాటర్‌ ఫ్రంట్‌ ల్యాండ్‌పై 50 శాతం అదనపు ప్రీమి­యం విధిస్తామని, ఈ మేరకు ఏపీ మారిటైం బోర్డు చర్యలు తీసు­కోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)