Breaking News

అప్పుల్లో ఆల్‌ టైమ్‌ రికార్డు

Published on Wed, 09/03/2025 - 05:44

సాక్షి, అమరావతి: అప్పుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు రికార్డు స్థాయి వృద్ధి సాధిస్తోంది. రాష్ట్ర ప్రజలపై నెల నెలా భారీగా అప్పుల భారాన్ని మోపుతూ సంపద సృష్టిలో తిరోగమనంలో వెళుతోంది. హామీలను ఎగ్గొడుతూ బడ్జెట్‌ లోపల, బయట అప్పులు చేయడంలో మాత్రం రాకెట్‌ వేగంతో దూసుకుపోతోంది. 

తాజాగా మంగళ­వారం రూ.5,000 కోట్లు అప్పు చేయడం ద్వారా బడ్జెట్‌ లోపల, బయట చేసిన చంద్రబాబు సర్కారు అప్పులు ఏకంగా రూ.2,09,085 కోట్లకు చేరాయి. 15 నెలల పాలనలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు గతంలో ఏ ప్రభుత్వమూ చేయ­లేదు. తాగునీటి ప్రాజెక్టులు, ఏపీఐఐసీ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేయడం ఈ విజనరీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

బడ్జెట్‌ అప్పులే రూ.1,33,702 కోట్లు...
ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్‌బీఐ 7.63 శాతం వడ్డీకి రూ.5,000 కోట్లు రుణం సమీకరించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్‌ లోపల రాష్ట్ర అప్పులే ఏకంగా రూ.1,33,702 కోట్లకు ఎగబాకాయి. బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.44,383 కోట్లు అప్పులు చేస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌ జలజీవన్‌ నీటి సరఫరా సంస్థ ఏర్పాటు చేసి రూ.10,000 కోట్లు అప్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ ఆస్తులను తాకట్టు పెట్టేందుకు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు చేసి రూ.7,500 కోట్లు అప్పులు చేయడానికి జీవో జారీ చేసింది. ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ద్వారా రూ.5,473 కోట్లు అప్పులు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

ఇవి కాకుండా బడ్జెట్‌ బయట మరిన్ని అప్పులను ప్రభుత్వం ఇప్పటికే చేసేసింది. మరోపక్క రాజధాని అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్ధ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ఇలా బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్‌ సిక్స్‌లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడ బిడ్డ నిధి అమలు చేయకుండా ఎగనామం పెట్టారు.

ప్రజలను తప్పుదోవ పట్టించి..
అధికారం చేపట్టి ఏడాదిన్నర కూడా కాకుండానే చంద్రబాబు సర్కారు రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా అటు ఆస్తులు సమకూర్చలేదు.. ఇటు హామీలను నెరవేర్చలేదు. గత ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం సిఫార్సులు, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేయగా రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేస్తున్నారంటూ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం ప్రజలను తప్పుదోవ పట్టించింది. తాను అప్పులు చేయకుండా సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు తీరా సీఎం అయ్యాక నెల నెలా అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)