Breaking News

సాఫ్ట్‌ ‘టెక్‌ దోపిడీ’

Published on Fri, 11/21/2025 - 05:10

సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కన్సల్టేషన్లు, సాఫ్ట్‌వేర్‌ పేరిట ప్రజా­ధనం దురి్వనియోగం చేస్తోంది. ఇందులో కూడా మీకింత.. మాకింత అన్నట్టు దోచేసుకుంటున్నారు. టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ సహకారం అందిస్తున్న సాఫ్ట్‌టెక్‌ అనే సంస్థకు కాంట్రాక్ట్‌ విలువ భారీ స్థాయిలో పెంచి, మరికొన్నేళ్లు కట్టబెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. సంబంధిత సంస్థకు ప్రతి ఐదేళ్లకు కాంట్రాక్టును పునరుద్ధరిస్తున్నారు. 

రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వంలో రూ.25 కోట్లతో తొలి ఐదేళ్లకు కాంట్రాక్టు అప్ప­గించారు. అయితే, గత ప్రభుత్వంలో ఎలాంటి అదనపు భారం లేకుండా పాత ధరతోనే పను­లు అప్పగించారు. కానీ, కూటమి ప్రభుత్వం అదే సంస్థకు ఈసారి కాంట్రాక్టును భారీగా పెంచి కట్టబెట్టింది. తాజాగా ఐదేళ్ల కాల వ్యవధికి సాఫ్ట్‌వేర్‌ సహకారం అందించేందుకు దాదాపు రూ.43 కోట్లు కాంట్రాక్టు ఇచి్చంది.

సేవలు అరకొర... చెల్లింపులు ఘనం
అరకొర సేవలకు కూడా భారీస్థాయిలో ప్యాకేజీలు, కాంట్రాక్టులు కట్టబెట్టడం చంద్రబాబు సర్కార్‌కే చెల్లింది. ఈ క్రమంలోనే సాఫ్ట్‌టెక్‌ సంస్థకు కోట్ల రూపాయిల కాంట్రాక్ట్‌ను ధారపోసింది. కానీ, ఈ సంస్థ సేవలు మాత్రం పేలవంగా ఉన్నా­యి. దాని సాఫ్ట్‌వేర్‌తో అనేక సమస్యలు వస్తున్నట్లు నిర్మాణదారులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

కాంట్రాక్టును దాదాపు రెట్టింపు చేసి 
ఎక్కడైనా కాంట్రాక్టు ఇచ్చేందుకు గతంలో చేసిన పనులను బేరీజు వేసి ప్రస్తుత ధరల్లో గరిష్టంగా 5 లేదా 10 శాతం పెంపుతో ఇస్తారు. ఇక్కడ మాత్రం సాఫ్ట్‌టెక్‌కు అందుకు భిన్నంగా దాదాపు రెట్టింపు చేసి ఇచి్చనట్టు విశ్వసనీయ సమాచారం. 

2015–19 మధ్య ఈ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు చెల్లించి దోపిడీకి పాల్పడింది. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రెట్టింపు దోపిడీకి తెరతీస్తూ సుమారు రూ.43 కోట్లు చెల్లిస్తున్నట్టు తెలిసింది. కేవలం సాఫ్ట్‌వేర్‌ అందించడానికి ఇంత పెద్దమొత్తం పెంచడంలో ఆంతర్యం ఏమిటనే చర్చ నడుస్తోంది. 

దుబారా బాబు 
ప్రజాధనాన్ని ప్రణాళికలు, సాఫ్ట్‌వేర్‌ పేరిట ఏజెన్సీలు, సంస్థలకు కట్టబెట్టడం చంద్రబాబుకు ఎప్పటినుంచో ఉన్న అలవాటేననే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు బీద అరుపులు అరుస్తూ, మరోవైపు ఊరూపేరులేని సంస్థలకు ప్రభుత్వ భూములు కట్టబెడుగూ.. ఇంకోవైపు ఎలాంటి ఉపయోగం లేని పనులకు డబ్బు వృథా చేయడం బాబు మార్కు పాలన అని ఆరి్థక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)