Breaking News

అన్నదాతలకు మరోసారి చంద్రబాబు వెన్నుపోటు

Published on Fri, 08/01/2025 - 17:42

సాక్షి,విజయవాడ: అన్నదాతలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు. అన్నదాత సుఖీభవం పథకానికి చంద్రబాబు ప్రభుత్వం కోత పెట్టింది.  రేపు(శనివారం, ఆగస్టు 2) పథకం అమలులో భాగంగా రూ.40 వేలకు గాను రూ.5 వేలు మాత్రమే ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  అదే సమయంలో గత ఏడాది ఖరీఫ్, రబీ డబ్బులు మొత్తం ఎగనామం పెట్టింది. రూ.7 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసా కోత విధించింది.

వైఎస్ జగన్ ప్రభుత్వంలో 53.58 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చగా.. చంద్రబాబు మాత్రం 46.85 లక్షలకు లబ్ధిదారులను తగ్గించేశారు. గత ఏడాది పూర్తిగా రూ.20 వేలు ఎగనామం పెట్టారు.  ఈ ఏడాది కేవలం 5 వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు సిద్ధమైంది. 

 రూ. 20 వేలు ప్రతీ రైతు కుటుంబానికి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాయంతో రూ.20 వేలు ఇస్తామని మెలికపెట్టారు. ఇలా గత ఏడాది రైతులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.10,800 కోట్లు ఎగ్గొట్టింది. ఈ ఏడాది కేవలం 2,342 కోట్లు మాత్రమే విడుదల చేయనుంది. 

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు భరోసా పథకాన్ని కాపీ కొట్టిన ప్రస్తుత సీఎం చంద్రబాబు.. పేరు మార్చి అన్నదాత సుఖీభవ అంటూ 14 నెలలుగా పథకాన్ని అమలు చేయకుండా రైతుల పొట్టకొడుతూ వచ్చారు. 

ఈ అంశాన్ని ఎత్తి చూపుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం కావడంతో ఆగస్టు 2 నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేల మాత్రమే రైతుల ఖాతాలో జమ చేయనుండడంతో కూటమి ప్రభుత్వంపై రైతన్నలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)