Breaking News

ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం

Published on Tue, 07/28/2026 - 04:40

దేవరపల్లి: గిట్టుబాటు ధరలు లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్న పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నాయ­కులు సోమవారం స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 5న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్నారని తెలిపారు. ఈ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమ­­ర్శించారు. 

చంద్రబాబు ప్రభు­త్వం స్పందించి రైతులకు తగిన న్యాయం చేసే వరకు ఉద్య­మాన్ని కొనసాగిస్తా­మని స్పష్టంచేశా­రు.  జగన్‌ ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా రైతులకు భరోసా కల్పించి పండిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్థానిక ఎంపీపీ కేవీకే దుర్గారావు నివాసం వద్ద పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ గుడివాడ అమర్నాథ్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మాజీ హోం మంత్రి తానేటి వనిత, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు,  తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడారు.  

కర్ణాటకలో కొనుగోళ్లు ప్రారంభమైతే.. మన రైతుకు మరింత కష్టం 
‘ప్రభుత్వం మెడలు వంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా జగన్‌ పర్యటన ఉంటుంది. రాష్ట్రంలో 232  మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా, వంద రోజుల్లో కేవలం 38 మిలియన్‌ కిలోల కొనుగోలు జరిగింది.  మరో 20 రోజుల్లో పొగాకు కొనుగోళ్లు జరగకపోతే ఆగస్టు 15 నుంచి కర్ణాటకలో కొనుగోలు ప్రారంభమవుతాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లోని రైతు­లు మరింత నష్టపోతారు. రాష్ట్రంలో లక్ష మంది రైతులు 2.05 లక్షల ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. వీరి గురించి చంద్రబాబు అసలు పట్టించుకోవడం లేదు. పైగా కొనుగోలు సంస్థలకు ప్రభుత్వం అండగా ఉండి రైతులను మోసం చేస్తోంది. 

గత ఏడాది కిలో రూ.453 ధర పలకగా,  ఈ ఏడాది దారుణంగా రూ.160 నుంచి రూ.265కు పడిపోయింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో  మాజీ ఎంపీ మార్గాని భరత్,  మాజీ ఎమ్మెల్యే­లు తలారి వెంకట్రావు, తెల్లం బాలరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభంపాటి జయరాజు, అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త సత్తి సూర్యనారాయణరెడ్డి, విశాఖ స్మార్ట్‌ సిటీ మాజీ చైర్మన్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు తదితర నేతలు పాల్గొన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)