తర్లువాడ.. గుండెదడ..

Published on Mon, 08/03/2026 - 04:17

సాక్షి, విశాఖపట్నం: శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం నగర దాహార్తిని తీర్చే ప్రధాన సహజ జలవనరుల్లో ఒకటైన తర్లువాడ కొండలు నేడు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అభివృద్ధి పేరుతో డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు పర్యావరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా, చట్టాలను పక్కనపెట్టి మరీ కొండలను పిండిచేస్తూ సహజ జలమార్గాలను ధ్వంసం చేయడం పర్యావరణవేత్తలను, స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాంకేతిక పురోగతి అవసరమే అయినప్పటికీ.. భవిష్యత్‌ తరాల తాగునీటి మూలాలను బలిపీఠంపై ఎక్కించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని తర్లువాడ కొండలు కేవలం రాతిగుట్టలు మాత్రమే కాదు. ఇవి తూర్పు కనుమల శ్రేణిలో భాగమైన ఈ కొండలు దశాబ్దాలుగా విశాఖ నగరానికి, భీమిలి, మధురవాడ పరిసర ప్రాంతాలకు సహజ జలసేకరణ వ్యవస్థలుగా పనిచేస్తున్నాయి. 1954 నుంచి ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తున్న గంభీరం గెడ్డ రిజర్వాయర్‌కు ప్రాణం పోసేది ఈ కొండలే. వర్షాకాలంలో తూర్పు కనుమలపై కురిసే ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి, కోట్లాది లీటర్ల నీటిని గంభీరం రిజర్వాయర్‌కు చేరవేసే ప్రకృతి ప్రసాదించిన జలరక్షణ కవచాలు.. ఛిద్రమైపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలి కాలంలో డేటా సెంటర్‌  ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతాన్ని కేటాయించడంతో పరిస్థితి దారుణంగా మారింది.  

నీటికి కటకటే 
ఇస్రోకి చెందిన ‘భువన్‌’ శాటిలైట్‌ మ్యాపింగ్‌ యాప్‌లో ఓసారి పరిశీలిస్తే.. తర్లువాడ కొండలపై నుంచి గంభీరం గెడ్డ వైపు నీలిగీతలు (సహజ జలధారలు) స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఈ సహజ జలప్రవాహ మార్గాలను.. డేటా సెంటర్‌ పనుల కారణంగా భారీగా తవ్వకాలు జరిపి మట్టితో కప్పేస్తున్నారు. ఈ సహజ జలమార్గాలను మూసేస్తే గంభీరం రిజర్వాయర్‌కు నీరుచేరే మార్గాలు శాశ్వతంగా మాయమైపోనున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో విశాఖ నగర తాగునీటి సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు, పర్యావరణశాఖ అధికారులు ఈ విధ్వంసాన్ని గమనించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

140 ఎకరాల కొండల్లో విధ్వంసం  
పచ్చని అటవీ సంపదతో, వర్షాధార వృక్షాలతో కళకళలాడే తర్లువాడ కొండల్లో దాదాపు 140 ఎకరాల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతాన్ని చట్టబద్ధమైన పర్యావరణ అనుమతులు లేకుండానే ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండలను చదును చేసేందుకు చేపట్టిన భారీ తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటోంది. పనుల తీరు పరిశీలించేందుకు ఎవరు వెళ్తున్నా.. వారిని నిలువరించి అరెస్టు చేసేందుకు సైతం చంద్రబాబు ప్రభుత్వం వెనకాడటం లేదు.  

విశాఖ ప్రజలు పోరాడాల్సిన సమయం  
ఈ తర్లువాడ కొండల విధ్వంసంపై జనసేన మాజీ నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సున్నిత ప్రాంతాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని టీఎన్‌ గోదావర్మన్‌ తిరుముల్పాడ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన తీర్పు ఇచి్చందని చెప్పారు. ఎలాంటి ప్రాజెక్టుకైనా  పర్యావరణ అనుమతి లేకుండా పనులు ప్రారంభించడం చట్టవిరుద్ధమన్నారు. పోస్ట్‌–ఫ్యాక్టో విధానంలో పనులు పూర్తిచేసిన తర్వాత అనుమతులు తెచ్చుకోవచ్చనే విధానాన్ని న్యాయస్థానం ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించదని పేర్కొన్నారు. 

పర్యావరణ ప్రభావ అంచనా నిర్వహించకుండా కొండలను తొలగించడం, సహజ జలవనరులను పూడ్చేయడం శిక్షార్హమైన నేరమని చెప్పారు. ప్రకృతి వనరులు.. పాలకులు లేదా రాజకీయ శక్తుల సొంత ఆస్తి కాదన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా పోరాడుతున్నారని చెప్పారు. అదే స్థాయి ప్రజా చైతన్యం, పర్యావరణ స్పృహ విశాఖ ప్రజల్లోను రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)