Breaking News

యాదవులకు చంద్రబాబు సర్కార్ వెన్నుపోటు

Published on Sat, 12/06/2025 - 11:04

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో యాదవ భవనం కోసం కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై యాదవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాదవుల విజ్ఞప్తి మేరకు ఎండాడ హైవే సమీపంలో  50 కోట్లు విలువైన 50 సెంట్ల భూమిని యాదవ భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో వారు భూమిపూజ కూడా నిర్వహించారు.

అయితే తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఆ కీలక ప్రాంతంలో ఉన్న భూకేటాయింపును రద్దు చేసి హైవేకు దూరంగా ఓ మారుమూల ప్రాంతంలో తక్కువ రేటు పలికే భూమిని ప్రత్యామ్నాయంగా కేటాయించడం యాదవ వర్గాల ఆవేదనకు కారణమైంది. రాజ‌కీయ దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్సీపీ యాదవ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

వైఎస్ జగన్ హయాంలో యాదవులకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. విశాఖ నగరంలోని పలు కీలక పదవులు కూడా యాదవ సంఘాల నాయకులకు అప్పగించారని వారు గుర్తు చేశారు. యాదవుల కోసం జగన్ ఇచ్చిన విలువైన భూమిని రద్దు చేసి నగరానికి దూరంగా ఉన్న తక్కువ రేటు స్థలాన్ని కేటాయించడం అన్యాయం అని వారు విమర్శిస్తున్నారు.

భవనం నిర్మాణం ఆలస్యానికి గురి కాకుండా పూర్వం కేటాయించిన విలువైన భూమినే తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ జగన్ కేటాయించిన స్థలాన్ని రద్దు చేశారు. అందుకే మారుమూల ప్రాంతంలో యాదవ భవనంకు స్థలం కేటాయించారని విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మాజీ మేయర్ హరి వెంకట కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)