Breaking News

భూ దందాకు బరితెగింపు!

Published on Fri, 07/24/2026 - 05:01

ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉన్న 22ఏ వ్యవస్థను బలహీన పరిచి.. లక్షల ఎకరాల విలువైన భూములు ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదానికి చంద్రబాబు సర్కారు తలుపులు తెరిచింది. ఇది ప్రమాదం అని తెలిసినా ఎందుకిలా చేస్తోందంటే దండుకోవడమే లక్ష్యమని ఇట్టే తెలుస్తోంది. ఎన్నో లొసుగులతో కూడిన జీవో 444 ఇందుకు నిదర్శనం. ఇది సంస్కరణ పేరు చెప్పి విలువైన ప్రభుత్వ భూములు, దేవదాయ–వక్ఫ్‌ ఆస్తులు, తీర ప్రాంత భూములను నచ్చిన వారికి కట్టబెట్టే ఎత్తుగడ. భూ పరిపాలనలో రాజకీయ జోక్యాన్ని పెంచి అందినకాడికి వెనకేసుకోవడమే ఇందులో మర్మమని రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, అమరావతి: నిషేధిత ఆస్తుల జాబితాపై చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన 444 నంబర్‌ జీవో లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యేందుకు దోహదం చేసేలా ఉందని రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైకి ఇది ఒక సంస్కరణలా కనిపిస్తున్నా, లోతుగా పరిశీలిస్తే ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తులకు ముప్పు తెచ్చే అవ­కాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. గతంలో తెచ్చిన 22ఏ రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఈ జీవోలో పకడ్బందీగా ఏ­ర్పాట్లు జరిగినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పా­రిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ­(ఏపీఐఐసీ), ఏపీ మారిటైమ్‌ బోర్డు భూములకు వెబ్‌ల్యాండ్‌లో కొత్త వర్గీకరణ చేస్తామనడంపై అ­భ్యంతరాలు వ్యక్తమవు­తు­న్నాయి.

ఆ సంస్థలు ఆన్‌ౖ­లెన్‌లో అభ్యర్థన పెడితే చాలు సీసీఎల్‌ఏ ఆమో­దంతో ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి వెబ్‌ల్యాండ్‌లో పట్టాగా మార్చే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఆ భూముల ఇష్టానుసారం అ­మ్మకాలు, బదిలీలు, రిజిస్ట్రేషన్లకు తలుపులు బా­ర్లా తెరిచినట్లే. ఈ మార్పునకు గెజిట్‌ నోటిఫికేషన్, అసెంబ్లీ ఆమో­దమే కాదు కనీసం కేబినెట్‌ సమ్మతం కూడా అవస­రం లేదు. ఒక ఆన్‌లైన్‌ వినతితో కార్పొ­రేట్, ప్రైవేట్‌ కంపెనీలకు మేలు చేయడం కోసం ఇంత పెద్ద మార్పు వెంటనే జరిగిపోతుంది.

దీని­వల్ల ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న లక్షలాది ఎకరాలు ఆ కంపెనీల పరమయ్యేందుకు ఆస్కారం కల్పించినట్లే. మరో­వైపు రామాయపట్నం పోర్టు నిర్వహ­ణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే పీపీపీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా అదే మారి­టైమ్‌ బోర్డు భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టాలుగా మార్చే వెసులుబాటు కల్పించడం గమ­నార్హం. పోర్టుల చుట్టూ భవిష్యత్తులో బంగారం కానున్న ఈ తీర ప్రాంత భూముల్ని ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడం చాలా సులువు అవుతుంది.

విలువైన భూములు అమరావతి పెద్దల చేతుల్లోకి..
ఇప్పటి వరకు 22ఏ జాబితాలో చేర్పులు, తొలగింపులు క్షేత్ర స్థాయి రికార్డుల ఆధారంగా ఆర్డీవో, సబ్‌ కలెక్టర్‌ స్థాయిలో జరిగేవి. ఇకపై వ్యవసాయ భూమి ఎకరం దాటినా, వ్యవసాయేతర స్థలం వెయ్యి చదరపు గజాలు దాటినా 22ఏ జాబితాలో చేర్చే తుది నిర్ణయం ప్రభుత్వానిదే. దీనర్థం చిన్న చిన్న భూములపై నిర్ణయం అధికారుల స్థాయిలో తేలిపోతుంది. అమరావతి, విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగర శివార్లలో రూ.కోట్ల విలువ చేసే ఎకరాలకు ఎకరాల భూముల ఫైళ్లు మాత్రం పెద్దల వద్దకు వెళ్లాల్సిందే.

అలాగే సీసీఎల్‌ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌) వద్ద పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లు, రివిజన్లు, రివ్యూలు అన్నింటినీ ప్రభుత్వానికి బదిలీ చేసుకున్నారు. రివిజన్‌ అధికా­రం ప్రభుత్వానిదే.. స్టే ఇచ్చే అధికారం ప్రభుత్వా­నిదే.. ఏ అధికారి ఉత్తర్వునైనా సుమోటోగా తిరగదోడే అధికారం కూడా ప్రభుత్వానిదే. రికా­ర్డుల ఆధారంగా నడవాల్సిన క్వాసీ జ్యుడీషియల్‌ వ్యవస్థను రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టడంపై రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా­రు. తమ సమస్యలపై సామాన్యులు తహశీల్దార్, కలెక్టరేట్ల చుట్టూ తిరగడమే భారమైతే ఇప్పుడు ఏకంగా అమరావతి పెద్దల చుట్టూ తిరగడం వారికి సాధ్యమవుతుందా.. అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ కొత్త ఏర్పాటు అధికార పార్టీ నేతల కోసమేనని స్పష్టమవుతోంది.

దేవుడి భూములకూ ఎసరు
వేలంలో అమ్మిన దేవదాయ, వక్ఫ్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలనే నిర్ణ­యం వివాదాస్పదమే. గతంలో వివాదాస్పదంగా, నామమాత్రపు ధరలకు, బినామీల పట్టుతో జరిగిన వేలాలకూ రక్షణ కల్పించేందుకే ఈ లొసుగు పెట్టుకున్నట్లు నిపుణులు చెబుతు­న్నారు. మరోవైపు కోర్టు కేసులు, ‘ఇతరాలు’ కేటగిరీల ఎంట్రీలపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతు­న్నాయి. మూడు నెలల్లో కోర్టు ఉత్తర్వు, గెజిట్‌ నోటిఫికేషన్‌ స్కాన్డ్‌ కాపీలు అప్‌లోడ్‌ చేయకపోతే ఆ ఎంట్రీలన్నీ మూకు­మ్మడిగా తొలగిపోతాయి. దశాబ్దాల నాటి కేసుల రికార్డులను, తాలూకా ఆఫీసుల్లో మురిగి­పోతు­న్న ఫైళ్లను మూడు నెలల్లో వెతకడం అసా«­ద్య­మని అధికారులే అంటున్నారు. వివాదాల్లో ఉన్న భూములు, కోర్టుల్లో నలుగుతున్న ఆస్తులను 22ఏ జాబితా నుంచి తప్పించి కమీషన్లు, వాటాలు దండుకునేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లు అర్థమవుతోంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)