Breaking News

మోసాల ద్వారా బాబు సర్కారు యువత లక్ష్యాలకు అడ్డుపడుతోంది

Published on Tue, 01/13/2026 - 04:14

సాక్షి, అమరావతి: యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని, కానీ... రాష్ట్రంలో యువత అందుకు భిన్నంగా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో హామీలను విస్మరించి యువతకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఆయన పాలన యువత, రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకొనే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన బోధనలను గుర్తుచేస్తూ... చంద్రబాబు యువతకు చేసిన మోసాలను ప్రస్తావిస్తూ వైఎస్‌ జగన్‌ సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ ఖాతాలో సోమవారం పోస్ట్‌ పెట్టారు. చంద్రబాబు పాలనలో 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.4,900 కోట్ల విద్యా దీవెన, రూ.2,200 కోట్ల వసతి దీవెన బకాయిలు పేరుకుపోయాయని ధ్వజమెత్తారు.

టీడీపీ కూటమి మేనిఫెస్టో వాగ్దానమైన యవతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి రెండేళ్లుగా చెల్లింపు లేదని గుర్తు చేశారు. ఆన్‌లైన్‌ సర్టీఫికేషన్‌ కోర్సులు నిలిపేశారని పేర్కొన్నారు. ఇలా మోసాలకు పాల్పడడం ద్వారా చంద్రబాబు సర్కారు యువత వారి లక్ష్యాలను సాధించకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు. వివేకానంద ప్రముఖ సూక్తిని ప్రస్తావిస్తూ ‘‘ఇకనైనా కదలండి.. మేల్కోండి.. యువత వారి లక్ష్యాల సాధనకు తోడ్పడండి’’ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. 

YS Jagan: ప్రమాదంలో ఏపీ భవిష్యత్తు.. అయోమయంలో యువత..

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)