Breaking News

అవినీతి సొమ్ముకు హెరిటేజ్‌ ముసుగు

Published on Mon, 05/13/2024 - 04:23

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎందుకిన్ని మోసాలు? బతుకంతా అబద్ధా­లేనా? మేనిఫెస్టో సరే.. అఫిడవిట్లో కూడా అబద్ధా­లేనా? తరచి చూస్తే తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు... లోకేశ్‌ నాయుడు ఇద్దరూ ఇప్పుడే కాదు... 2019లోనూ అబద్ధాల అఫిడవిట్లే వేశారు. 2019లో హెరిటేజ్‌ షేర్‌ విలువ రూ.260.81 ఉండగా... అఫిడవిట్లో మాత్రం ఏకంగా రూ.511.90 ఉన్నట్టుగా చూపించారు. పైపెచ్చు వీళ్లకు ఉన్నవి ఒకటీరెండూ షేర్లు కాదు. 2019లో చంద్రబాబుకు  1,06,61,652 షేర్లు... లోకేశ్‌ నాయుడికి 4,73,800 షేర్లు ఉన్నాయి. 

అప్పట్లో వీటి వాస్తవ విలువ చంద్రబాబుది రూ.278 కోట్ల పైచిలుకు కాగా...  లోకేశ్‌ది రూ.12.40 కోట్లు. కానీ చంద్ర­బాబు తన షేర్ల విలువను ఏకంగా రూ.545 కోట్లు­గా చూపించారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లు లోకేశ్‌ కూడా తన షేర్ల విలువను రూ.24.25 కోట్లు­గా చూపించారు. అంటే ఇద్దరూ కలిసి తమ హెరి­టేజ్‌ షేర్ల విలువను దాదాపు రూ.279 కోట్లు ఎక్కు­వగా చూపించారు. ఇదంతా ఎందుకో తెలుసా?

ఐటీ కళ్లు కప్పడానికి ముసుగు...
నిజానికి 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్కిల్‌ డెవల­ప్‌­మెంట్‌ కుంభకోణం సహా పలు కుంభకోణాలకు తెరతీశారు. ఈ స్కాముల్లో చాలా నిధులు రకరకాల మార్గాల్లో మళ్లీ తన దగ్గరికే రప్పించుకున్నారు. ఈ సొమ్ముతో ఆస్తులు పెంచుకున్నా... అవేవీ రికార్డుల్లో కనపడకుండా జాగ్రత్త పడ్డారు. చాలా ఆస్తుల్ని బినామీల పేరిట పెట్టారు. అయితే షాపుర్జీ పల్లోంజీ సహా కొన్ని కంపెనీల నుంచి తీసుకున్న డబ్బులు నేరుగా చంద్రబాబు ఖాతాల్లోకే రావటంతో దానికి ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.

ఆ నోటీ­సులకు జవాబిచ్చేటపుడు కూడా... నాకు నోటీసు­లిచ్చే అధికారం మీకు లేదంటూ బుకాయించడం... అదే కారణంతో కోర్టులో సవాల్‌ చేయటం తప్ప ఆదా­యానికి సంబంధించిన సమాధానాలేవీ ఇవ్వ­లేదు. అయితే ఆ డబ్బులు పెరిగిన ఆస్తుల్లో, తన బ్యాంకు ఖాతాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో వాటికి ఈ హెరిటేజ్‌ ముసుగు వేసినట్లుగా నిపు­ణు­లు చెబుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అధికారి­కంగా అన్ని ఆస్తులు ఎలా పెరిగాయనే ప్రశ్న వస్తుంది కాబట్టి... హెరిటేజ్‌ షేర్లకు అంత విలువ లేకపో­యినా వాటి పేరిట చూపిస్తే సరిపో­తుందని ఈ ప­న్నా­­గం పన్నినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఈ సారి అఫిడవిట్లో షేర్ల సంఖ్య పెంచేసి మరో అక్రమం...
ఇలాంటి తప్పుల్ని, మోసాల్ని సహించలేమంటూ 2019 ఎన్నికల్లో జనం బాబుకు బుద్ధి చెప్పి ఓడించటం అందరికీ తెలిసిందే. కాకపోతే మళ్లీ ఈ సారి ఎన్నికల్లో మునుపటిలాగే షేరు విలువను ఎక్కువ చేసి చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకు­న్నారో ఏమో... షేర్ల సంఖ్యను పెంచి చూపించారు. అప్పట్లో ఉన్న షేర్ల సంఖ్య 1,06,61,652 కాగా... ఇపుడా షేర్ల సంఖ్య ఏకంగా 2,26,11,525కు పెరిగినట్లు చంద్రబాబు చూపించారు.

అంటే రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. అప్పట్లో వీటి మొత్తం విలువను రూ.545 కోట్లుగా చూపించిన చంద్ర­బాబు... ఇప్పుడు 2,26,11,525 షేర్లను ఒక్కొ­క్కటీ రూ.337.85గా చూపిస్తూ... హెరిటేజ్‌లోని తన షేర్ల విలువ రూ.. 767.44 కోట్లుగా పేర్కొన్నారు. లోకేశ్‌ కూడా తన షేర్లు 4,73,800 నుంచి 1,00,37,453కు పెరిగినట్లుగా... వాటి విలువ రూ.337.85 చొప్పున రూ.339 కోట్లుగా చూపించారు.

బోనస్, స్ప్లిట్‌.. ఏమీ లేకుండానే
నిజానికి 2019 తరువాత హెరిటేజ్‌ షేర్ల విభజన జరగలేదు. అంటే ఒక షేరును విభజించి రెండుగా చేయటమో ఏదో జరిగితే తప్ప చంద్రబాబు నాయుడి షేర్లు అలా రెట్టింపయ్యే అవకాశం లేదు. పోనీ బోనస్‌ షేర్లను జారీ చేశారా అంటే... అది కూడా లేదు. ఈ రెండూ కాకుండా ఈ మధ్యలో చంద్రబాబు ఎవరి వద్దనుంచైనా హెరిటేజ్‌ షేర్లను కొనుగోలు చేశారా అంటే... అది కూడా లేదు. మరి ఎలా పెరిగాయి? 2019లో హెరిటేజ్‌ షేర్లకు లేని విలువను ఉన్నట్టుగా చూపించి వాటిని ఏకంగా రూ.545 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు... ఇప్పుడు వాటి విలువ రూ.337 ప్రకారం కోటి షేర్లుగా చూపిస్తే మొత్తం విలువను రూ.337 కోట్లుగా చూపించాలి. 

అంటే ఐదేళ్లలో హెరిటేజ్‌ షేర్ల విలువను తగ్గినట్లు చూపించాలి. ఇది కంపెనీకి కూడా ఇబ్బందికరంగా మారవచ్చని, తన 2019 అఫిడవిట్‌ బాగోతం బయటపడే అవకాశం ఉందని భావించి... ఈ సారి కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. తండ్రి బాటలోనే లోకేశ్‌ కూడా తన షేర్ల సంఖ్యను అమాంతం పెంచేసి... 4 లక్షల షేర్లను కోటి షేర్లుగా చూపించారని, ఇదంతా అవినీతి సొమ్ముకు అధికారిక ముసుగు వేయటానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్ల వాటా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మరి వాటా పెరగకుండా షేర్ల సంఖ్య పెరగటం ఎలా సాధ్యం? నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పించడం చట్టరీత్యా నేరం. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్లు సమ­ర్పిస్తే.... సెక్షన్‌ 125 ఏ ప్రకారం... అభ్యర్థిపై విచారణ జరపవచ్చని కొన్ని కేసుల్లో కోర్టులు స్పష్టంగా తీర్పునిచ్చాయి కూడా. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)