Breaking News

ప్రైవేటు సంస్థలపై పెరుగుతున్న సైబర్‌ దాడులు

Published on Sat, 12/06/2025 - 09:25

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో ప్రైవేటు కంపెనీలను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ దాడులు, డేటా దొంగతనాలు గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి జితిన్‌ ప్రసాద తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎస్‌.నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. 2020–24 మధ్య దేశవ్యాప్తంగా ప్రైవేటు సంస్థలపై 5.77 లక్షల సైబర్‌ దాడులు జరిగినట్లు తెలిపారు. 

చాట్‌ జీపీటీ, ఏఐ వాడితే రహస్య సమాచారం లీక్‌ 
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది చాట్‌ జీపీటీ, ఏఐ వంటి టూల్స్‌ వాడటంవల్ల రహస్య సమాచారం లీకయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి జితిన్‌ ప్రసాద చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రహస్య, సున్నిత సమాచారం దేశం బయటకు చెప్పడం, సురక్షితం కాని ప్లాట్‌ఫామ్‌లలో షేర్‌ చేయడం నిషేధమని తెలిపారు.

భారత్‌–బ్రిటన్‌ వాణిజ్య ఒప్పందం 
ఇటీవల జరిగిన భారత్‌–బ్రిటన్‌ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పంద సమావేశం (సీఈటీఏ)లో క్రాస్‌–బోర్డర్‌ డేటా ప్రవాహాలు, డేటా లోకలైజేషన్‌ నియమాలను పునఃసమీక్షించే అవకాశాలపై ఒప్పందం జరిగినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ అయోధ్యరావిురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి జితిన్‌ ప్రసాద జవాబిచ్చారు.  

ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవు
రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎన్‌ఐఎల్‌)లోని 32 డివిజన్లనను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు, ప్రైవేటు భాగస్వామ్యం కోసం ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌ (ఈవోఐ) ఆహ్వానించినట్లు వస్తున్న వార్తలు నిజంకాదని కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. ప్రైవేటీకరణకు ప్రతిపాదనలేవీ లేవని చెప్పారు. 

రైతులకు సహాయం 
2022–23 నుంచి 2024–25 మధ్య ప్రకృతి వైపరీత్యాలవల్ల నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) ద్వారా దాదాపు రూ.609 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు కేంద్ర వ్యవసాయ, సంక్షేమశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్‌.. వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ ప్రశ్నకు సమాధానమిచ్చారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)