Breaking News

కొత్త రైలు.. కొండ కోనల్లో హొయలు

Published on Wed, 08/14/2024 - 05:44

చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మా­రు­మూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఒడిశాలోని మల్కనగిరి నుంచి భద్రాచలం సమీపంలోని పాండురంగాపురం వరకు సుమారు 173 కిలోమీటర్ల కొత్త రైల్వే లైను ఇటీవల మంజూరైంది. ఈ లైనుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. 

ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ రైల్వేలైను నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.  ఒడిశాలోని మల్కనగిరి నుంచి ఆంధ్రాలోని విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా తెలంగాణలోని పాండురంగాపురం వరకు కొత్త లైను నిర్మించనున్నారు. లైను నిర్మాణంలో భాగంగా 213 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 48 పెద్ద వంతెనలు, 165 చిన్న వంతెనలున్నాయి. 

ముంపు మాటేంటి? 
విలీన మండలాల్లో ప్రతిపాదించిన రైల్వేలైను పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవనుంది. చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరుగట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో నిర్మించనున్న స్టేషన్లు సైతం ముంపునకు గురయ్యే అవకాశముంది. దీంతోపాటు శబరినదిపై నిర్మించే వంతెన సైతం ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్వే చేసిన మార్గం గుండా కాకుండా ముంపునకు గురికాని మార్గంలో లైను నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. లైనుతో పాటు స్టేషన్లు ముంపు పరిస్థితిపై రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని స్థానికులు వేచి చూస్తున్నారు.  

విలీన మండలాల మీదుగా.. 
మల్కనగిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించనున్న రైల్వేలైను విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక గుండా సాగనుంది. దీనిలో భాగంగా ఒడిశాలోని మల్కనగిరి, కోవాసిగూడ, బదలి, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి, లూనిమన్‌గూడలో, ఆంధ్రాలోని అల్లూరి జిల్లా చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరు గట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో స్టేషన్లు నిర్మించనున్నారు. 

అనంతరం నందిగామ నుంచి తెలంగాణలోని భద్రాచలం అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వేలైను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో సర్వే పనులు పూర్తి చేశారు. దీనిలో భాగంగా కూనవరం మండలం జగ్గవరం వద్ద మహరాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ నుంచి వచి్చన ప్రత్యేక బృందాలు 50 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్‌ చేసి మట్టి శాంపిల్స్‌ పంపారు. కాగా ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించేందుకు శబరి నదిపై ఒడిశాలోని మోటు, చింతూరు మండలం వీరాపురం నడుమ వంతెన నిర్మించాల్సి ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)