Breaking News

అందరి నోటా.. ఒకే మాట

Published on Wed, 08/05/2026 - 05:50

సాక్షి, అమరావతి/తాటిచెట్లపాలెం (విశాఖ)/ రాజమహేంద్రవరం: డీఎస్సీ–2025 నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ  మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర­వ్యాప్తంగా ఒకే డిమాండ్‌ వినిపించింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు మంగళవారం అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రా­ల్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్, టౌన్‌హాల్‌ సమావేశాల్లో పార్టీ నేత­లు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘా­ల ప్రతి­ని­ధులు, ఉపాధ్యాయులు, మేధా­వులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. 

డీఎ­స్సీ అక్రమాలపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యా­యం చేయాలని, వి­ద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి
వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో అఖి­లపక్ష సమావేశం నిర్వహించారు. దీనికి కాంగ్రెస్, సీపీఐ, ఇతర రాజకీయ పక్షాలు, మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, వర్తక, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. మార్గాని భరత్‌ మాట్లాడుతూ..డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సీబీఐ విచారణ జరిపిస్తే తప్ప డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యేందుకు అవకాశం లేదన్నారు. 

అక్రమాల వల్లే ఉద్యోగం రాలేదు  
డీఎస్సీలో జరిగిన అవకతవకల వల్ల తనకు రావాల్సిన ఉద్యోగం కోల్పోయానని విశాఖ జిల్లా సింహాచలం ప్రాంతానికి చెందిన బాధిత అభ్యర్థి సంతోష్‌ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్‌సీపీ విశా­ఖ జిల్లా అధ్యక్షుడు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో కైలాసపురంలోని పి.కన్వెన్షన్‌లో ఏపీ జెన్‌–జెడ్‌ వార్‌ టౌన్‌హాల్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘డీఎస్సీ–2025లో పీజీటీ ఇంగ్లిష్‌ పరీక్ష రాసి మంచి మార్కులు సాధించాను. జోన్‌–1లో 92వ ర్యాంకు వచ్చింది.

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలిచినా సెప్టెంబర్ 15న విడుదల చేసిన ఎంపిక జాబితాలో నా పేరు లేదు. కారణం తెలుసుకోవడానికి డీఈవో, ఆర్జేడీ కార్యాలయాలకు వెళ్లినా జీవో–77 ప్రకారం జరిగిందని చెప్పి చేతులు దులిపేసుకున్నారు.  పీజీటీ ఇంగ్లిష్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ పోస్టుల్లో ఈడబ్ల్యూఎస్‌ వరి్టకల్‌ రిజర్వేషన్‌ను తప్పుగా అమలు చేసి.. 852వ ర్యాంకు వచి్చన అభ్యరి్థని ఎంపిక చేశారు. విచారణ చేస్తే అతనికి ఎలాంటి లో–విజన్‌ లేదని తెలిసింది. అతనే తప్పుడు సరి్టఫికెట్‌ తెచ్చుకున్నానని, మీకు కూడా అవకాశముంటే అలాంటి సరి్టఫికెట్‌ తెచ్చుకోమని చెప్పాడు.  సెలక్షన్‌ లిస్ట్‌ విడుదలైన తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 80 మంది డీఎస్సీ బాధిత అభ్యర్థులతో కలిసి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ నివాసానికి వెళ్లాం. 

లోకేశ్‌ను కలిసి మా సమస్య వివరించుకుంటాం. మాలో ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వండని పోలీసులను వేడుకున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఇప్పటికైనా డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని సంతోష్‌ పార్వతి విజ్ఞప్తి చేశారు. – డీఎస్సీ బాధిత అభ్యర్థి సంతోష్‌ పార్వతి

డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి
నిరుద్యోగ, యువజన జేఏసీ డిమాండ్‌
మంగళగిరి రూరల్‌: డీఎస్సీ నియామకాల్లో అనేక అక్రమాలు జరిగాయని.. వాటిపై సీబీఐతో విచారణ జరిపించాలని నిరుద్యోగ, యువజన జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని విద్యాభవ¯న్‌లో స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. స్పోర్ట్స్‌ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. పైగా సబ్జెక్టు టీచర్‌ పోస్టులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ కోటాలో సబ్జెక్టు టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. దేశంలో ఎక్కడైనా పరీక్షలు నిర్వహించకుండా ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. స్పోర్ట్స్‌ కోటాలో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు ఆధారాలతో సహా తాము నిరూపిస్తామని సవాల్‌ చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ కన్వీనర్‌ రామచంద్ర, వి.వెంకటేశ్, సీహెచ్‌.అర్జున్, జి.రోసిబాబు తదితరులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)