మంత్రి కాకాణికి సీబీఐ క్లీన్ చిట్

Published on Sun, 02/04/2024 - 10:34

సాక్షి, విజయవాడ: నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో సీబీఐ ఛార్జ్‌ షీట్ దాఖలు చేసింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఛార్జ్‌ షీట్‌లో సీబీఐ స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది.

ఏడాది పాటు విచారణ జరిపి, 403 పేజీల చార్ఝ్ షీట్ దాఖలు సీబీఐ.. 88 మంది సాక్షులను విచారించింది. సొమిరెడ్డి ఆరోపణలను కొట్టిపారేసిన సీబీఐ.. మంత్రి కాకాణికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. ఏపీ పోలీసుల విచారణను సీబీఐ సమర్థించింది. పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్‌లను సీబీఐ దోషులుగా నిర్ధారించింది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని చార్జ్‌ షీట్‌లో స్పష్టం చేసింది.

హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ విచారణకు తాను సిద్ధమని హైకోర్టులో మంత్రి కాకాణి ముందే చెప్పారు. సీబీఐ విచారణ జరపాలని హైకోర్టును మంత్రి కోరారు. సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని అప్పట్లోనే హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ తెలిపారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌తో చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డిలకు షాక్ తగిలింది. రెండేళ్లుగా చేసిన ఆరోపణలన్నీ సీబీఐ ఛార్జ్‌షీట్‌తో పటాపంచలయ్యాయి.

ఇదీ చదవండి: టీడీపీ వెన్నులో వణుకు.. జగన్‌ జన బలం సుప్ర‘సిద్ధం’! 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)