Breaking News

పోలీసులపై దాడి చేసిన టీడీపీ నేతలపై కేసులు 

Published on Fri, 01/06/2023 - 09:29

శాంతిపురం/చిత్తూరు అర్బన్‌: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా బుధవారం పోలీసులపై దాడులకు తెగబడిన టీడీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాళ్లబూదుగూరు ఎస్‌ఐ మునస్వామి తెలిపిన వివరాల మేరకు పోలీసులపై దాడి చేసిన ఇతర జిల్లాలకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులతో పాటు కుప్పం నియోజకవర్గ పరిధిలోని పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఎస్‌.గొల్లపల్లి క్రాస్‌లో పోలీసులపై దాడి, చేయి చేసుకోవడం, తోసివేయడం, దౌర్జన్యం చేయడంపై పలమనేరు సీఐ అశోక్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

విశ్వనాథనాయుడు, కేదార్‌నాథ్, ఆంజనేయరెడ్డి, చంద్రకళ, నాగరాజు, అనసుయ, ప్రవీణ్, సుగుణ, రమేశ్, జయపాల్‌ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. అనుమతి లేకుండా ప్రచార ర«థాలను వినియోగించినందుకు రామకుప్పం మండలం ననియాలకు చెందిన రాజశేఖర్, పశ్చిమగోదావరి జిల్లా పెద్దవల్లమిల్లికి చెందిన నానిబాబు, గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన రాజుపై కేసులు నమోదు చేశారు. 121 పెద్దూరులో కృష్ణమూర్తి ఇంటి మేడపై ఉన్న పోలీసులపై దాడికి సంబంధించి గంగవరం ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మంజునాథ్, అరుణ్‌కుమార్‌ తదితరులపై కేసులు నమోదయ్యాయి. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు.  

వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు.. 
ప్రతిపక్షనేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేస్తారంటూ వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబును ఏక్షణమైనా పోలీసులు అరెస్టు చేయొచ్చంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. ఇలా తప్పుడు సమాచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)