Breaking News

సాక్షి పత్రిక, టీవీ రిపోర్టర్లు, కెమెరామెన్‌లపై కేసులు

Published on Wed, 01/07/2026 - 05:33

సాక్షి, అమరావతి: సాక్షి పత్రిక, టీవీ లక్ష్యంగా చంద్రబాబు సర్కారు మరోసారి వేధింపులకు పాల్పడింది. తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించాయన్న కథనానికి సంబంధించి సాక్షి పత్రిక, టీవీ రిపోర్టర్లు, కెమెరామెన్‌లపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా తిరుపతిలో, తిరుమలలో ఇష్టారీతిన వ్యవహరించారు. తిరుపతి సాక్షి ఫొటోగ్రాఫర్‌ ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి ఒక సీఐ, ఎస్‌ఐ, 20 మంది పోలీసులు సోదాలతో హల్‌చల్‌ చేశారు. టెరర్రిస్టులు, స్మగ్లర్లు, హంతకుల కోసం గాలించినట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగైదుసార్లు ఫొటోగ్రాఫర్‌ ఇంట్లో సోదాలు చేశారు.

సాక్షి ఫొటోగ్రాఫర్‌ ఇంట్లో లేకపోవడంతో ఎక్కడికెళ్లాడంటూ ఇంట్లోవాళ్లమీద ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధించారు. మీ ఆయన ఎక్కడ, ఫోన్లు ఎక్కడ పెట్టాడు.. అంటూ గుచి్చగుచ్చి అడిగారు. ఇంతమంది రావడం ఏమిటి, అసలు ఏం జరిగిందని ఫొటోగ్రాఫర్‌ కుటుంబసభ్యులు అడిగినా పోలీసులు సమాధానం చెప్ప­లేదు. సాయంత్రం ఫొటోగ్రాఫర్‌ కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చి అతడిని విచారణకు హాజరుకావాలని చెప్పమని సూచించి వెళ్లిపోయారు. రోజంతా పోలీసులు ఇష్టారీతిన వ్యవహరించడంతో సాక్షి ఫొటోగ్రాఫర్‌ కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు.  

ఇదే వార్తను ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఇతర పత్రికలు ప్రచురించినా, ఎల్రక్టానిక్‌ మీడియా చానళ్లు విస్తృతంగా ప్రసారం చేసినా.. ఒక్క సాక్షి రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లను మాత్రమే పిలిపించి విచారించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కక్షపూరితంగా సాక్షి విలేకరులనే లక్ష్యంగా చేసుకుని విచారణ జరపడం మీడియా స్వేచ్ఛపై దాడేనని జర్నలిస్టు వర్గాలు మండిపడుతున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)