Breaking News

స్పీకర్‌పై కేసు నమోదు చేయాలి

Published on Wed, 08/27/2025 - 04:25

నెల్లూరు (క్రైమ్‌): పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా, వారిని కించపరిచేలా మాట్లాడిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీమంత్రి, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్‌ కె.సత్యనారాయణరెడ్డి తదితరులు నెల్లూరు నగరంలోని వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరావుకు ఈ ఫిర్యాదు ఇచ్చారు. 

అనంతరం కాకాణి మీడియా­తో మాట్లాడుతూ బాధ్యతాయతమైన స్పీకర్‌ పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు పోలీసుల్ని కించపరిచే వి«ధంగా దుర్భాషలాడడం సిగ్గుచేటని చెప్పారు. ఆయనపై తక్షణమే కేసు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్‌ చేశారు. ఇటీవల స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా దొండపూడిలో కొత్తకోట సీఐ, ఎస్‌ఐలను నోటికొచి్చనట్లు మాట్లాడారని చెప్పారు. ఎస్కార్ట్‌ ఆలస్యమైందని పోలీసు అధికారులను తిట్ట­డం, అందుకు టీడీపీ నాయకులు ఈలలు వేయడం, చప్పట్లు కొట్టడం సిగ్గుచేటన్నారు. 

అవి.. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదని చెప్పారు. అయ్య­న్న వ్యాఖ్యలు పోలీసుల ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నా.. ఇంతవరకు పోలీసు అధికారుల సంఘం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. గతనెలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు వస్తే.. పోలీసు అధికారుల సంఘం వారు విలేకరుల సమావేశం నిర్వహించి జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిపరులను పరామర్శించేందుకే వచ్చారని మాట్లాడారని అన్నారు. 

తమ­ను న్యాయస్థానాలు దోషులుగా నిర్ధారించకపోయి­నా పోలీసు అధికారుల సంఘం దోషులమని నిర్ధారించడం దారుణమన్నారు. స్పీకర్‌ పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా పోలీసు అధికారుల సంఘం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు ఏం మాట్లాడినా భరిస్తామని, ప్రతిపక్ష నాయకులు పోలీసుల పేరు ఎత్తితే భరించబోమన్నట్లు వారి తీరు ఉందని చెప్పారు. పోలీసు అధికారులను దుర్భాషలాడిన స్పీకర్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేయాలని ఎస్పీని కోరారు.  

పోలీసులకే రక్షణ కొరవడింది  
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లడుతూ శాంతిభద్రతలను కాపాడే పోలీసులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)