Breaking News

అచ్చెన్నా.. ఇదేంటన్నా!?

Published on Sun, 07/14/2024 - 05:54

పెదకాకాని: వారు వ్యాపారులు కారు.. డీలర్లూ కాదు.. సొంత పొలంలో వరి పంట విత్తుకోవడానికి కొందరు కలిసి విత్తనం తెచ్చుకున్న అన్నదాతలు. అదే వారి పాలిట శాపమైంది. వారేదో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్లు అధికారుల తనిఖీలు.. పోలీసుల రంగ ప్రవేశం.. కేసుల నమోదు.. అసలు రాష్ట్రంలో నెల రోజులకు పైగా ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. పొలం వాళ్లది.. డబ్బులు వాళ్లవి.. శ్రమ వాళ్లది.. చేతనైతే సహకరించాల్సింది పోయి రైతులపై కేసులు పెట్టడం ఏమిటి? మునుపటికొకడు ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండి.. అన్న చందంగా ఎవరో ఫిర్యా­దు చేస్తే సరిగా విచారించకుండానే ఈ దుందుడుకు చర్యలు ఏమిటి? 

గుంటూరు జిల్లా పెదకాకాని మండ­లం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన అమ్మి­శెట్టి రోజేశ్వరరావు, మరికొందరు రైతులు కలి­సి ఈ నెల 2వ తేదీన 30 కిలోల బరువుగల 58 సంచుల వరి విత్తనాలను తెలంగాణ నుంచి తెప్పించారు. వాటిని రోజేశ్వరరావు తన గోడౌన్‌లో దించుకున్నారు. అదేరోజు గుంటూరు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు అందిన సమాచారం మేరకు మండల వ్యవసాయాధికారి (ఏవో) పి.సంధ్యారాణి గ్రామానికి వచ్చారు. వరి విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారు.. అనుమతులున్నాయా అంటూ విచారించారు. 

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పెదపాపయ గ్రామం నుంచి నందీశ్వర సీడ్స్‌ పేరుతో ఉన్న వరి విత్తనాలను తామంతా కలిసి కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. అందుకు సంబంధించిన బిల్లు కూడా చూపించారు. ఒక్కరి పేరుతో ఇన్ని విత్తనాలు కొనుగోలు చేయకూడదని, షెడ్డులో ఉన్న 58 బస్తాలు సీజ్‌ చేస్తామని ఏవో చెప్పారు. తాము ఏటా వంద ఎకరాలకు పైగా వరి సాగు చేస్తామని రైతులు రోజేశ్వరరావు, మల్లికార్జునరావు, సాంబశివరావు తదిత­రులు విత్తనాలు సీజ్‌ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో రైతులు తమ విధులకు ఆటంకం కలిగించా­రని ఏవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసినట్లు శనివారం సీఐ కె.వీరా­స్వామి తెలిపారు. రైతులపై కేసు నమోదు చేయ­డం పట్ల చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశి్నస్తున్నా­రు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని, రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)