Breaking News

మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు

Published on Wed, 08/27/2025 - 04:47

ఏలూరు సిటీ: కూటమి నేతల రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో పోలీసుల విధి ‘సత్యం వధ.. ధర్మం చెర’గానే మారింది. మొదట్లో సోషల్‌ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులపై బుసలు కొట్టిన రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపైనా కోరలు చాస్తోంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌ­దరిపై టీడీపీ మూకలు దాడికి తెగబడగా.. అసలు నిందితులను వదిలేసి అబ్బయ్య చౌదరి, మాజీ మంత్రి పేర్ని నాని, పార్టీ శ్రేణు­లపైనా తప్పుడు కేసులు నమోదు చేసి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అంటే ఏమిటో పోలీసులు మరోసారి రుజువు చేశారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఈ నెల 21న వైఎస్సార్‌సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరికి చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి చొరబడి పామాయిల్‌ గెలలను కోస్తున్న వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అదే క్షేత్రంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటిపై టీడీపీ మూకలు బీరు సీసాలు, కర్రలు, రాడ్లతో దాడి చేసి వీరంగం చేశారు.

ఈ ఘటనపై బాధితుడైన అబ్బయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేయ­గా.. దాడికి యతి్నంచిన టీడీపీ మూకలను వదిలేసి ఆయనపైనే ఎదురు కేసు నమోదు చేశారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్‌సీపీకి చెందిన జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పెనుమాల విజయ్‌బాబు, మా­జీ ఎమ్మెల్యే సోదరులు చల్లగోళ్ల ప్రదీప్, తేజ, ఉప్పలపాటి ప్ర­సా­ద్‌­తో పాటు మొత్తం 15 మందిపై కేసులు నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులనూ పోలీసులు వదల్లేదు.  

తాజాగా పేర్ని నానిపై కేసు నమోదు 
ఇదే అంశంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నా­నిపైనా పోలీసులు మంగళవారం అక్రమ కేసు నమోదు చేశా­రు. అబ్బయ్యచౌదరి నివాసంపై బీరు సీసాలు, కర్రలు, రాడ్లతో టీడీపీ మూకలు దాడికి యతి్నంచిన విషయం తెలిసి మాజీమంత్రి పేర్ని నాని తదితరులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అబ్బయ్య చౌదరి పొ­లంలో టీడీపీ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుండటంతో వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు పేర్ని నాని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కూడిన బృందం ఈ నెల 22న కొండలరావుపాలెంలో అబ్బయ్యచౌదరి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి.. ఆయనకు సంఘీభావం ప్రకటించింది. అనంతరం పేర్ని నాని, సాకే శైలజానాథ్‌ ఏలూరు­లోని పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకుని అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు వినతిపత్రం సమరి్పంచారు.

అబ్బ­య్య చౌదరి నివాసం, ఆయన వ్యవసాయ క్షేత్రంలో దాడికి య­తి్నంచిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వినతిప్రంలో కోరారు. అనంతరం పోలీస్‌ జిల్లా కార్యాలయం వెలుపల మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏదైనా ఉంటే రాజకీయపరంగా చూసుకుందామని, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం సరైన విధానం కాదని దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులకు హితవు పలికారు.

టీడీపీ నేతలు, కార్యకర్తల దాషీ్టకాలపై రాజకీయ విమర్శలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, రెండు వర్గాల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలే వ్యాఖ్యలు చేశారని ఏలూరు మండలం పాలగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నేతల రవి ఈ నెల 25న పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు పేర్ని నానిపై తప్పుడు కేసు నమోదు చేశారు.  

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)