Breaking News

రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన కారు.. లోకో పైలట్‌ సమయస్ఫూర్తితో..

Published on Wed, 08/09/2023 - 11:52

సాక్షి, విశాఖపట్నం: షీలానగర్‌లో మారుతి సర్కిల్‌ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు దాటుతూ నలుగురు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ట్రాక్‌పై సడన్‌గా నిలిచిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న గూడ్స్‌ రైలు లోకో పైలట్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారులోని ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు.

పట్టాలపై కారు నిలిపోవడాన్ని గూడ్స్‌ రైలు లోకో పైలట్‌ గమనించి వెంటనే వేగాన్ని తగ్గించాడు. అయినప్పటికీ రైలు స్వల్పంగా ఢీకొట్టడంతో కారులో కొంతభాగం నుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురూ బయటకు దూకి స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు రిటైర్డ్ నేవీ అధికారికి చెందిన కుటుంబంగా సమాచారం. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: విజయవాడలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు..

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)