Breaking News

పిండ ప్రదానానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..

Published on Mon, 09/22/2025 - 05:10

మార్టూరు: మహళయ పక్షాల్లో చివరిరోజు అయిన ఆదివారం అమావాస్య రోజు పితృదేవతలకు ఇష్టమైన వంటకాలతో పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయన్న నమ్మకంతో ఆలయానికి బయల్దేరిన కుటుంబంలోని ముగ్గురు మార్గంమధ్యలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కోలలపూడి సమీపంలో జరిగింది. వేగంగా వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా అడ్డొచి్చన కుక్కను తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న సిమెంట్‌ దిమ్మెలను, డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. 

వివరాలివీ.. తిరుపతి పట్టణంలో రేడియేటర్‌ మెకానిక్‌ అయిన దామర్ల లక్ష్మణ్‌ (70), అతని భార్య సుబ్బాయమ్మ (65), కుమారుడు గణేష్ బాబు, అతని భార్య పద్మజ, వారి కుమారుడు హేమంత్‌ (25)లతో కలిసి కారులో పిఠాపురం ఆలయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు బయల్దేరారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా కుక్క రావడంతో దానిని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి రహదారి పక్కన  సిమెంట్‌ దిమ్మెలను ఢీకొని పల్టీ కొట్టుకుంటూ మార్జిన్లోకి దూసుకెళ్లింది. 

ప్రమాద ధాటికి డ్రైవింగ్‌ సీట్లో ఉన్న హేమంత్, తాతయ్య లక్ష్మణ్, నానమ్మ సుబ్బాయమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన గణేష్‌బాబు, అతని భార్య పద్మజను పోలీసులు మార్టూరు ప్రభుత్వాస్పత్రికి అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ముగ్గురి మృతదేహాలకు మార్టూరు ప్రభుత్వాస్పత్రిలో పంచనామా చేయించి బంధువులకు అప్పగించారు. గణేష్ బాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)