Breaking News

అమరావతి విస్తరణకు మరింత భూమి

Published on Sat, 09/13/2025 - 05:23

సాక్షి, అమరావతి : రాజధాని అమరావతి విస్తరణకు రైతుల నుంచి ఇంకా భూమి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఇక్కడతోనే అభివృద్ధి ఆపేస్తే అమరావతి చిన్న మున్సిపాలిటీగానే మిగిలిపోతుందన్నారు. వే 2 న్యూస్‌ సంస్థ మంగళగిరిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పరిశ్రమలు వస్తేనే అక్కడ భూముల విలువ పెరుగుతుందన్నారు. మరింత భూమి తీసుకోకపోతే అభివృద్ధి 33 వేల ఎకరాలకే పరిమితమవుతుందన్నారు. 

అలాగే, రాజధాని ల్యాండ్‌ మోనటైజేషన్‌ ప్రాజెక్టు అని చెప్పారు. హైటెక్‌ సిటీ రాకముందు హైదరాబాద్‌లో ఎకరం లక్ష రూపాయలే ఉండేదని.. ఇప్పుడు ఎకరం రూ.100 కోట్లకు చేరిందన్నారు. హైదరాబాద్‌ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారాలంటే గుంటూరు–విజయవాడ–తెనాలి వాటి పరిసర గ్రామాలు కలి­స్తేనే మహానగరంగా మారుతుందన్నారు. క్వాంటమ్‌ వ్యాలీకి శ్రీకారం చుట్టామని.. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకొచ్చాయని చంద్రబాబు చెప్పారు. 

అలాగే, ప్రముఖ విద్యా సంస్థలు రాబోతున్నాయన్నారు. అమరావతిలో ప్రారంభించిన ప్రతీ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తవుతుందని.. వీటిని ప్రధాని ప్రారంభిస్తారని ఆయనన్నారు. ఇక మెడికల్‌ కాలేజీలు కట్టకుండా, కట్టేశామని చెబుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. తాము ప్రైవేట్‌ వారికి వాటిని అప్పజెప్పడంలేదని.. పీపీపీ పద్ధతిలోనే నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, నిర్వహణ ప్రభుత్వానిదేనని అన్నారు. 

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)