Breaking News

జగన్‌ హయాంలో జనహిత పాలన

Published on Thu, 11/14/2024 - 04:50

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ హయాంలో సామాజిక రంగం వ్యయం భారీగా పెరిగిందని కాగ్‌ (కంప్టోల్రర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదిక స్పష్టం చేసింది. 2023–24 ఆర్థి క సంవత్సరానికి సంబంధించిన ఆర్థి క నివేదికను కాగ్‌ బుధవారం అసెంబ్లీకి సమర్పించింది.

 సామాజికరంగ వ్యయంతో పాటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీబీటీ ద్వారా గ్రాంట్‌ రూపంలో ఇచ్చిన వివరాలతోపాటు స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు గడచిన ఐదేళ్లలో గ్రాంటు రూపంలో ఇచ్చిన మొత్తం ఎలా పెరిగిందనే వివరాలను.. ఐదేళ్లలో పన్ను ఆదాయం పెరుగుదలను కాగ్‌ వివరించింది. 

సామాజిక రంగంలో (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు) 2022–23లో రూ.88,647 కోట్లు వ్యయం చేయగా 2023–24లో రూ.97,396 కోట్లు వ్యయం చేసినట్టు కాగ్‌ స్పష్టం చేసింది. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరంలో వేతనాల తరువాత అత్యధిక వ్యయం డీబీటీ ద్వారా గ్రాంటుగా ఇచ్చినట్టు వెల్లడించింది. 

అలాగే రాష్ట్ర సొంత పన్నులు, కేంద్ర పన్నుల వాటా రాబడి 2019–20లో రూ.85,843 కోట్లు ఉండగా.. 2023–24 నాటికి రూ.1,31,633 కోట్లకు పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది. అలాగే స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు గ్రాంటు రూపంలో 2019–20లో రూ.59,915 కోట్లు ఇవ్వగా.. 2023–24 నాటికి ఆ గ్రాంట్‌ మొత్తం రూ.91,248 కోట్లకు పెరిగినట్టు వివరించింది. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)