Breaking News

తడిసిన ధాన్యం.. రైతు కళ్లలో దైన్యం

Published on Wed, 12/04/2024 - 05:15

వరి కోతలు ప్రారంభమై నెల దాటింది. రైతులు ధాన్యాన్ని కల్లాల్లో రాశులు పోసి అమ్మేందుకు సిద్ధం చేశారు. గతంలో మాదిరిగా ఈ ఏడు కూడా కల్లం వద్దే మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎదురు చూశారు. అయితే ప్రభుత్వం అడ్రస్‌ లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమశాతం పేరుతో అధికారులు ధర తగ్గిస్తున్నారు. 

ఇదే అదనుగా తీసుకుని దళారులు, మిల్లర్లు.. రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. నాలుగు రోజులు ఆగితే పరిస్థితులు మారకపోతాయా, ప్రభుత్వం పట్టించుకోకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న మీదికి పులిమీద పుట్రలా ఫెంగల్‌ తుపాన్‌ వచ్చిపడింది. రైతు కష్టాలను రెట్టింపు చేసింది. 

తుపాను వస్తుందని నాలుగు రోజుల ముందే వాతావరణశాఖ హెచ్చరించినా సర్కారు మొద్దు నిద్ర కారణంగా తడిసిన ధాన్యపు రాశుల వద్ద రైతు చేష్టలుడిగి చూస్తున్నాడు. ఇంత పెద్ద ఆపద వస్తే సీఎం కనీసం అధికారులతో సమీక్షించిన పాపానపోలేదు. మంత్రులు ట్వీట్లకు, నాయకులు మాటలకు పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి దయనీయంగా మారింది. 


పరిస్థితులు అంచనావేసి ప్రభుత్వం సకాలంలో స్పందించి ధాన్యం కొనుగోలు చేస్తే ఈ చింత మాకెందుకంటూ రైతన్న గోడు వెళ్ల­బో­సు­కుంటున్నాడు. వచ్చిందే అవకాశమనుకుని కళేబరాన్ని పీక్కుతినే రాబందుల్లా దళారులు, నాయకులు ఏకమై రక్తాన్ని పీల్చేస్తుంటే ఏమీ చేయ­లేని నిస్సహాయ స్థితిలో రైతన్న కల్లం వద్ద కన్నీరు కారుస్తున్నాడు. 

రహదారుల పక్కన టార్పాలిన్లపై తడిసిన ధాన్యాన్ని ఆరబోసు­కుని ఎప్పుడు కొంటారో, ఎంతకి కొంటారో తెలియక బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నాడు.    – సాక్షి నెట్‌వర్క్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)