Breaking News

తెగిపోయిన పెదవాగు ప్రాజెక్టు ఆనకట్ట

Published on Fri, 07/19/2024 - 05:04

వేలేరుపాడు: కుండపోత వర్షాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాన్ని ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నీటి ప్రవాహం ఉధృతం కావడంతో పెదవాగు ప్రాజెక్టు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తెగిపోయింది. దీంతో మండలంలోని మేడేపల్లి, కమ్మరగూడెం, అల్లూరి నగర్, ఒంటిబండ, రామవరం ఊటగుంపు, ఉదయ్‌నగర్, సొంబే గొల్లగూడెం, గుల్లవాయి, పాత పూచిరాల గ్రామాల్లో ఇళ్లు నీట మునిగాయి. అకస్మాత్తుగా ప్రాజెక్టు నీరు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు. 

పెదవాగు ప్రాజెక్టుకు చేరువలో ఉన్న మేడేపల్లి, అల్లూరి నగర్, ఒంటి బండ, కమ్మరగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా నీరు రావడంతో సమీపంలోని గుట్టల పైకి, భవనాల పైకి ఎక్కారు. వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. సహాయక చర్యలు అందించేందుకు ఆయా గ్రామాలకు అధికారులు వెళ్లాలన్నా రహదారి సౌకర్యం లేదు. ఆయా గ్రామాల ప్రజలే సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. 

వేలేరుపాడు మండలం మేడేపల్లి మొదలుకొని అల్లూరి నగర్, కోయ మాధవరం, గుల్లవాయి తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ నీట మునిగాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో వేళ్లవాగు, ఎద్దెల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎద్దెల వాగు వద్ద వంతెన అప్రోచ్‌ కొట్టుకుపోయింది. వేలేరుపాడు నుంచి రుద్రమ్మకోటకు వెళ్లే రహదారిలో పెదవాగు వంతెన వద్ద రహదారి అంతా నీట మునిగింది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)