Breaking News

ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదు: బొత్స

Published on Sun, 06/21/2026 - 16:20

బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయ పాలెంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో  బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... విశాఖ, తిరుపతిలో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, ఇటువంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు. నేటి సమావేశం తమ బాధలు పంచుకోవడానికి, ఒకరికి ఒకరు అండగా ఉండేందుకేనని చెప్పారు.

‘‘ఎక్కడ సమస్య వస్తే నాయకులమంతా అక్కడికి వెళ్తాం. చట్టానికి మేం వ్యతిరేకం కాదు. మేమంతా చట్టాన్ని గౌరవిస్తాం. రాజకీయాల్లో రివేంజ్ నిర్ణయాలు పనికిరావు. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చే హక్కుల్ని కోరుతున్నాం. కాపులకు 3.000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. ఒక కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు. గతంలో కాపునేస్తం ఇచ్చాం.. ప్రజల అవసరాలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలు సహకారం అందించాలి. ఉన్న వాటిని తీసేస్తే ఊరుకునేది లేదు. 

రానున్న రెండు-మూడేళ్లలో కాపు జాతికి గౌరవం పెరిగేటట్టు ప్రయత్నించాలి. ఇది పార్టీలకు పరిమితం కాదు. రాజకీయ పార్టీలో గౌరవం కోరుకుంటాం. కూటమి పార్టీలో కాపులకు అది దక్కటం లేదు. కులంలో ఉన్న వారంతా విద్రోహులు, సంఘ వ్యతిరేక శక్తులు అని మాట్లాడటం సరికాదు.. ఇంకోసారి మాట్లాడితే ఊరుకునేది లేదు. ముద్రగడ కూడా సమావేశానికి హాజరు రావాల్సి ఉంది. ఆరోగ్యం బాగాలేక రాలేదు. సమావేశంలో చర్చించిన ప్రతి అంశాన్ని తీర్మానంగా రూపొందించాం. 

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరు ముందుకు వచ్చినా అందరూ కలిసి అక్కడ వెళ్లి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరు 50 వేల రూపాయలు చొప్పున వేసుకుని సాయి కృష్ణ కుటుంబానికి అందించాలి. 
రాజకీయం కాదు ఒక కుటుంబానికి అందించే సాయం. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఇప్పటివరకు చంపిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఇదే వేరే కులంలో జరిగితే ఊరుకుంటారా. ఈ సమావేశం కాపు నాయకులందరికీ ఒక సందేశం ఇస్తుంది. మేము మీకు అండగా ఉంటాము అని కాపులందరికీ భరోసా కల్పిస్తుంది’’ అని బొత్స తెలిపారు. 

సమావేశంపై ఆరోపణలు
సమావేశంలో రూపొందించిన తీర్మానాలను సభకు కురసాల కన్నబాబు వివరించారు. ముద్రగడ  తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అన్నారు. ఈ సమావేశం గురించి సమాచారం బయటకు వచ్చిన వెంటనే కాపులను చీల్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కొందరు ఆరోపణ చేసేశారు. 

ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. ‘‘నాకు మహిళల పట్ల గౌరవం ఉంది. ఒక వ్యక్తికి సంబంధించిన విషయంలో మాత్రమే మాట్లాడాను. మహిళలందరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదు. ఎక్కువగా కుల ప్రస్తావన చేసింది పవనే’’ అని తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)