Breaking News

రాయుడు హత్యకేసులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలకు సమన్లు?

Published on Wed, 12/31/2025 - 06:06

సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్‌చార్జి వినుత కోట డ్రైవర్‌ శ్రీనివాసులు (రాయుడు) హత్యకేసులో చెన్నై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డికి సమన్లు జారీచేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జ్‌ వినుత డ్రైవర్‌ మృతదేహం ఈ ఏడాది జూలై 10న చెన్నై కూవం నదిలో లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో వినుత, చంద్రబాబు దంపతుల్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో వారిద్దరు చేసిన వ్యాఖ్య­లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. 

తరువాత కొద్దిరోజులకు రాయుడు సెల్ఫీ వీడియో ఒకటి వైరల్‌ అయింది. ఆ వీడియోలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి పేరును పదేపదే ప్రస్తావించటంతో రాజకీయంగా టీడీపీకి షాక్‌ తగిలింది. జనసేన నేత వినుత ఆరోపణలు, రాయుడు సెల్ఫీ వీడియో ఆధారంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డిని విచారించేందుకు చెన్నై పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుజిత్‌కుమార్‌రెడ్డికి సమన్లు జారీచేసి సెల్‌ఫోన్‌ డేటాతో పాటు, అతడి బ్యాంకు లావాదేవీలను పోలీసులు సేకరించినట్లు తెలిసింది. మరోవైపు జనసేన పార్టీ కార్యకర్త పేట చంద్రశేఖర్‌కి సమన్లు జారీచేసి సోమవారం శ్రీకాళహస్తిలో విచారించారు. అతడి నుంచి ఫోన్‌ డేటా, బ్యాంకు లావాదేవీలను తీసుకున్నట్లు సమాచారం. మృతుడు రాయుడు బ్యాంక్‌ లావాదేవీల వివరాలను సేకరించి, అతడి నాయనమ్మను మరో­సారి విచారించినట్లు తెలిసింది. 

మృతుడు రాయు­డు శ్రీనివాస క్లినిక్‌లో చికిత్స పొందిన ఆధారాలను కూడా నమోదు చేశారు. రాయుడు చనిపోవడానికి ముందు బంగారు దుకాణంలో చైన్‌ కొనుగోలు చేసిన­ట్లు లభించిన ఆధారాల మేరకు ఆ షాపు యజమా­నితో మాట్లాడిన పోలీసులు ఆ బిల్లులను సేకరించారు. రాయుడు బంధువులు, స్నేహితులను విచారించి వారి బ్యాంకు వివరాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. వినుత తండ్రి భాస్కర్‌తోపాటు వారు ఉంటున్న ఇంటి యజమానిని, వినుత ఇంట్లో పనిమనిíÙని కూడా పోలీసులు విచారించి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు.

తన రాజకీయ ప్రాబల్య­ం తగ్గించే కుట్రలో భాగంగానే రాయుడు హత్య జరిగిందని, ఈ హత్యకు దారితీసిన పరిస్థితులపై లోతుగా విచారణ చేపట్టాలని కోరుతూ అందుకు కొన్ని ఆధారాలను నిందితురాలు వినుత పోలీ­సుల­కివ్వడంతో ఆదిశగా విచారణ చేపట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండురోజుల్లో బొజ్జల సు«దీర్‌రెడ్డికి సమన్లు ఇచ్చి స్టేట్‌మెంట్‌ నమోదు చేయనున్నట్లు సమాచారం. దీంతో రాయుడు హ­త్య­కు గురికాలేదని, ఆత్మహత్య చేసుకున్నాడని న­మ్మించే ప్రయ­త్నా­లు జరుగుతున్నాయనే ప్రచారమూ సాగుతోంది.    

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)