Breaking News

క్రిస్‌సిటీ నిర్మాణానికి దిగ్గజ సంస్థల పోటీ

Published on Sun, 11/12/2023 - 05:20

సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం వద్ద అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక నగరం ‘క్రిస్‌’సిటీ నిర్మాణానికి దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. తొలిదశలో రూ.1,5­03.16 కోట్లతో 2,500 ఎకరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులివ్వడంతో ఈపీసీ విధానంలో రూ.1,021.41 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానించింది. తుది బిడ్డింగ్‌లో మూడు కీలక సంస్థలు అర్హత సాధించినట్లు ఏపీఐ­ఐసీ వీసీఎండీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

ప్రస్తుతం ఈ టెండర్ల మదింపు జరుగుతోందని, అర్హత సాధించిన తర్వాత వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధంచేసినట్లు ఆయన తెలి­పారు. చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద 10,834.5 ఎకరాల్లో పారిశ్రామిక పా­ర్కును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

ఇందు­కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ఇండ­స్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (నిక్‌డిక్ట్‌)తో కలిసి ఏపీఐఐసీ నిక్‌డిక్ట్‌–­కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ లిమి­టెడ్‌ (క్రిస్‌సిటీ) పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు­చేసింది. పూర్తిస్థా­యిలో తొలిదశ అందుబాటులో­కొ­స్తే 78,900 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.  

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)