ప్రభుత్వ వేధింపులతోనే సతీష్‌ మృతి

Published on Sat, 11/15/2025 - 04:58

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల పరకామణికి సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌ కుమార్‌ ప్రభుత్వ ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే మృతి చెందారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసి ఆయన మృతికి కారణమైన అధికారులపై సీబీఐతో విచారణ జరిపించాలని డి­మాండ్‌ చేశారు. సతీష్‌ కుమార్‌ మరణానికి కారణమైన ప్ర­భుత్వం, పోలీస్‌ అధికారులతో పాటు ఆయన మీద ఒత్తిడి తెచ్చినవారందరినీ దోషులుగా చేర్చాలన్నారు.

విచారణ పేరుతో సాటి పోలీసులనే వేధిస్తూ, తప్పుడు కేసులు నమో­దు చేయిస్తూ ఈ ప్రభుత్వం తప్పుడు సంప్రదాయానికి తెర తీసిందని మండిపడ్డారు. పోలీసు అధికారుల మరణాలకు కారణమయ్యేలా జరుగుతున్న విచారణలు పోలీసు సమా­జా­నికే అవమానకరమన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులే లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం అందుకు అధికారులను పావులుగా వాడుకుంటోందన్నారు. తమపై ఎలాగైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలన్న ప్రభుత్వ కుట్రలకు ఒక అమాయక పోలీసు అధికారి బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడారు.

సీబీఐతో విచారణ జరిపించాలి..
‘ఈ ప్రభుత్వం చేస్తున్న అపచారాలను ప్రశి్నస్తున్న నన్ను దో­షిగా ఇరికించేందుకు టీటీడీ పాలకమండలి అధ్యక్షుడి నుంచి నారా లోకేష్‌ వరకూ ఏ రకంగా మాట్లాడారో, ట్వీట్లు చేశా­రో అందరికీ తెలుసు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. సతీష్‌ మరణం వెనుక కారణాలు వెలుగులోకి రావాలంటే సీ­బీఐ విచారణకు ఆదేశించాలి. పది రోజులుగా జరుగుతున్న సీఐడీ విచారణ తతంగం, న్యాయమూర్తి ఆదేశాలకు భిన్నంగా నన్ను ఇరికించడానికి జరుగుతున్న యత్నాలపై కూడా సీబీఐతో దర్యాప్తు చేయించాలి’ అని భూమన డిమాండ్‌ చేశారు.

ఇది ప్రభుత్వ హత్యే..!
‘పరకామణికి సంబంధించి రెండు నెలలుగా పత్రికల్లో వస్తున్న కథనాలతో సతీష్‌ కుమార్‌ తీవ్రంగా కలత చెందారు. వారం రోజులుగా సీఐడీ విచారణ పేరుతో తనను వేధిస్తోందని సన్నిహితుల వద్ద ఆయన వాపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం నా పేరు చెప్పాలంటూ సతీష్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చి మానసిక క్షోభకు గురి చేసింది. పోలీసు అధికారుల ద్వారా రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం పన్నిన కుట్రలకు ఒక అమాయకుడు, సౌమ్యుడు, నిజాయితీపరుడైన పోలీస్‌ అధికారి బలైపోయారు. ఎస్పీ గంగాధర్, డీఎస్పీలు వేణుగోపాల్, గణపతి అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.

పరకామణి కేసును విచారిస్తున్న అధికారులు న్యాయమూర్తి ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. రౌడీలు, గూండాల తరహాలో పచ్చి బూతులు తిడుతూ విచారణ ఎదుర్కొంటున్న వారిని వేధిస్తున్నారు. ఏ అర్హత లేని లక్ష్మణ్‌ రావు అనే క్రిమినల్‌ కూడా విచారణలో పాల్గొని సతీష్‌ కుమార్‌ను బండ బూతులు తిట్టాడు. తన పై అధికారి సీవీఎస్వీ నరసింహ కిషోర్‌ చెప్పడం వల్లే రాజీకి వెళ్లానని అధికారులకు సతీష్‌ కుమార్‌ చెప్పారు’ అని భూమన చెప్పారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)