Breaking News

‘చంద్రబాబు, లోకేశ్‌ను తరిమికొడతాం’

Published on Mon, 04/17/2023 - 05:07

తాడికొండ: దళితులంటే చిన్నచూపుతో మాట్లా­డు­తున్న చంద్రబాబు, లోకేశ్‌ను రాష్టం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం 931వ రోజుకు చేరాయి.

పలువురు నాయకులు మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా దళితులను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటని, దళిత బహుజనులు తమకు ఓట్లేయడం లేదనే అక్కసుతో చంద్రబాబు, లోకేశ్‌ అక్కసు వెళ్లగక్కుతున్నా­రని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో చంద్ర­బాబు దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా... అంటే, ఇప్పుడు లోకేశ్‌ దళితుల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

పాదయాత్రలో లోకేశ్‌కు ప్రతి గ్రామంలో ముందు ఎదురయ్యేది జగనన్న కాలనీలేనని, వాటిని చూసిన ప్రతిసారి వెన్ను­లో వణుకు మొదలై దళితులు, బహుజనులు తమను ఎక్కడ విస్మరిస్తారో అనే భయం పట్టుకుని అసహనంతో మాట్లాడుతున్నాడన్నారు. నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, పులి దాసు, న్యాయవాది పెరికే వరప్రసాద్, ఈపూరి ఆదాం పాల్గొన్నారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)