Breaking News

కోనసీమలోనూ భీమవరం తరహా పందేల ఏర్పాట్లు

Published on Sun, 01/12/2025 - 03:45

సాక్షి, అమలాపురం: కోడిపందేలంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతమే గుర్తొస్తుంది. ఈసారి భీమవరం తరహా ఏర్పాట్లను తలదన్నేలా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పందేలకు పెద్దఎ­త్తున సన్నాహాలు చేస్తున్నారు. సినిమా సెట్టింగ్‌లను తలపించేలా.. పెద్దపెద్ద సినిమాల ఫ్రీ రిలీజ్‌ ఫంక్షన్ల మాదిరిగా కోనసీమలో ఏర్పాట్లు చేస్తు­న్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ.పోలవరం మండలం మురమళ్లలో కోడిపందేలు, గుండాటలకు భారీ ఏర్పాట్లు జరుగు­తున్నాయి. 

టీడీపీ హయాంలో 2014–­2019 మధ్య ఇక్కడ పెద్దఎత్తున కోడి పందేలు, పొట్టేలు పందేలు, గుండాటలు నిర్వహించారు. ఈసారి అంతకుమించి మురమళ్లల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) స్వగ్రామం మురమళ్ల కావడం, ఆయన అశీస్సులు పుష్కలంగా ఉండటంతో నిర్వాహకులు రెండు ఫుట్‌బాల్‌ మైదానాలంత స్థలంలో పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10 ఎకరాల స్థలంలో 10 వేల మందికి పైగా కూర్చుని పందేలు చూసేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

దూరప్రాంతాల నుంచి వచ్చే 500 మంది వీవీఐపీల కోసం సోఫా సెట్‌లు, కూలర్లు ఏర్పాటు చేయనున్నారు. రెండు బరుల్లో పందేలు నిర్వహించనున్నారు. పందేలు అందరికీ కనిపించేలా చుట్టూ భారీ ఎల్‌సీడీలు ఏర్పాటు పెడుతున్నారు. కోడి పందేలతోపాటు గుండాటలు కూడా పెద్దఎ­త్తున నిర్వహించనున్నారు. 

కోనసీమ రుచులను చూపించేందుకు ఫుడ్‌ స్టాల్స్‌ కూడా ఏర్పాటవుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలోని పేరొందిన బిర్యానీలు, మాంసాహారం, ఆత్రేయ­పురం పూతరేకులతో పాటు పలు స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

ఆంధ్రా గోవా అంటూ..
ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాం బీచ్‌ను ‘ఆంధ్రా గోవా’గా అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తరచూ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి పండుగ మూడు రోజులు బీచ్‌వద్ద ఉత్సవాలు నిర్వహి­స్తు­న్నారు. 

ఇదే సమయంలో టీడీపీ, జనసేన నాయకులు సమీపంలోనే కోడి పందేలు, గుండాటలకు సిద్ధమవు­తున్నారు. ఇందుకు వేలం పాటలు కూడా నిర్వహించినట్టు సమాచారం. ఆంధ్రా గోవా అని పిలుస్తు­న్నందుకు పండుగ రోజులలో బీచ్‌ను గోవా తరహాలో జూద కేంద్రంగా మారుస్తున్నారని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)