Breaking News

ఏపీ బీచ్‌లలో మద్యం అమ్మకాలు.. ఎప్పటి నుంచంటే?

Published on Wed, 06/17/2026 - 17:52

సాక్షి,విజయవాడ: ఏపీలో బీచ్‌ బార్ల పేరిట మందు బాబులతో భారీగా మద్యం తాగించాలని చంద్రబాబు సర్కార్‌ మరో నిర్ణయం తీసుకుంది. బీచ్‌లలో బార్లు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. బీచ్ షాక్స్ పేరుతో ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ 362 జీవో ఇచ్చింది.12 జిల్లాల్లో ఏపీటీడీసీ గుర్తించిన చోట్ల బీచ్ షాక్స్ ఏర్పాటుకు విధివిధానాల్ని రూపొందించింది. 

మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఎంపిక చేసిన బీచ్‌లలో ఏర్పాటు కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్టు వరకు బీచ్ షాక్స్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద సూర్యలంక, విశాఖ బీచ్‌లలో ఏర్పాటుకు ప్రతిపాదన తెచ్చింది.

బీచ్‌లలో మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తుంటే.. ‘విశాఖ బీచ్‌లో బీచ్‌ షాక్స్‌ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి..? అంటూ బాలకృష్ణ అల్లుడు, టీడీపీ విశాఖ ఎంపీ శ్రీభరత్‌ అన్నారు. విశాఖ బీచ్‌లో బీచ్‌ షాక్స్‌ అందుబాటులోకి తేవడంలో నాకెలాంటి తప్పు కనిపించడం లేదు. ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు? అందరూ తాగుతున్నారు కదా.. 

ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేదంటున్నారే.. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో మహిళలకు భద్రత, రక్షణ ఉందా..? అని ప్రశ్నించారు. సోషల్‌ మీడియా ద్వారా అబద్ధపు ప్రచా­రాలు ఎక్కువవుతున్నాయని, అందుకనే వాటిని తొలగిస్తున్నట్టు చెప్పారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌తో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవా తరహాలో విశాఖ బీచ్‌లో  ‘బీచ్‌ షాక్స్‌’ పేరిట మద్యం పాలసీ తీసుకొస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన వెల్లడించారు.

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)