Breaking News

బార్లు.. ఇక బార్లా

Published on Tue, 08/19/2025 - 02:11

సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్‌ సాగిస్తున్న అడ్డగోలు దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం బార్ల తలుపులు బార్లా తెరచింది. రాష్ట్రంలో బార్లు తెరిచి ఉంచే వేళలను మరో రెండు గంటలపాటు పెంచింది. అంటే అనధికారికంగా మరో నాలుగు గంటలు బార్లు తెరచి ఉంచినా పట్టించుకోబోమని స్పష్టమైన సంకేతం ఇచి్చంది. మరోవైపు టీడీపీ సిండికేట్‌కు బార్లు ఏకపక్షంగా కట్టబెట్టేందుకు రెస్టారెంట్‌ నిబంధనలను సడలించింది.

దరఖాస్తు చేసేనాటికి రెస్టారెంట్‌ లేకపోయినా పర్వాలేదని నిబంధనల్లో పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానాన్ని అనుసరించి సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త బార్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 840 బార్ల లైసెన్సుల జారీకి సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ మంగళగిరిలో సోమవారం మీడియా సమావేశంలో నూతన బార్‌ విధానాలను వెల్లడించారు.  

ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ..
ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బార్లు తెరిచి ఉంచే సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రభుత్వం పొడిగించింది. అంటే 24 గంటల్లో 14 గంటలపాటు బార్లు తెరచి ఉంటాయి. తద్వారా ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు బార్లు  బార్లా తెరిచే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీ హయాంలో బార్లు ఉదయం 11  గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేశాయి.  

⇒ కల్లు గీత కుటుంబాలకు కేటాయించిన 10 శాతం బార్లకు లైసెన్సు ఫీజు 50శాతం తక్కువగా నిర్ణయించారు.  
⇒ మూడేళ్లపాటు బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు సోమవారం నుంచి ఈ నెల 26 సాయంత్రం 5గంటల వరకు స్వీకరిస్తారు. నేరుగా గానీ ఆన్‌లైన్‌ ద్వారాగానీ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.5లక్షలు.  

⇒ ఇప్పటివరకు రెస్టారెంట్‌ ఉన్నవారే బార్ల లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనే ని­బంధన ఉంది. ఈ నిబంధనలో టీడీపీ కూ­టమి ప్రభుత్వం సడలింపునిచ్చింది. బార్‌ లైసెన్సు పొందిన తరువాత 15 రో­జుల్లో రెస్టారెంట్‌ ఏర్పాటు చేసుకునేందు­కు అవకాశం కల్పించింది. 28న లాటరీ విధానంలో బార్ల లైసెన్సులు కేటాయిస్తారు.  

⇒  పట్టణాలు, నగరాల్లో జనాభా ప్రాతిపదికన బార్ల లైసెన్సు ఫీజు నిర్ణయించారు. 50 వేల జనాభా ఉన్న పట్టణాలకు రూ.35 లక్షలు, జనాభా 50 వేలు నుంచి 5 లక్షలలోపు ఉంటే రూ.55 లక్షలు, జనాభా 55 లక్షలు పైబడి ఉంటే రూ.75 లక్షలు లైసెన్స్‌ ఫీజు చెల్లించాలి. 
⇒  ఇప్పటివరకు లైసెన్స్‌ ఫీజును ఒకేసారి చెల్లించాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనను సడలిస్తూ ఆరు వాయిదాల్లో లైసెన్స్‌ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)