Breaking News

‘పనిలేని మం..లోడు అదేదో బొచ్చు పీకినట్లు’..

Published on Sun, 09/21/2025 - 05:23

సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘పనిలేని మం..లోడు అదేదో బొచ్చు పీకినట్లు’ అంటూ బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్‌ మీడియాలోనూ, నాయీ బ్రాహ్మణులు, బీసీ వర్గాల నుంచి పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తింది. ఫోన్లు చేసి మరీ ఆయనపై విరుచుకుపడ్డారు. వివరాలివీ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం నిర్వహించిన చలో మెడికల్‌ కళాశాల నిరసన కార్యక్రమానికి కౌంటర్‌గా శనివారం బాపట్ల శివారులోని మెడికల్‌ కళాశాల వద్ద ఎమ్మెల్యే నరేంద్ర వర్మ హడావుడి చేశారు. 

అనంతరం మీడియా సమక్షంలోనే ఆయన ‘పనిలేని మం...లోడు అదేదో బొచ్చు పీకినట్లు’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు బూమరాంగ్‌ అయి తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సోషల్‌ మీడియా­లో ఇది బాగా వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే మాటలు నాయీ బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆయన్ను తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు.  

ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులతోపాటు బీసీలు కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే నరేంద్రవర్మపై విరుచుకుపడి నానా చీవాట్లు పెట్టారు. బీసీ సంఘాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. అధికార గర్వం తలకెక్కి మాట్లాడారని, తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నాయీ బ్రాహ్మణులతోపాటు బీసీలు డిమాండ్‌ చేశారు. 

 ఫోన్లు చేసి మరీ ఎమ్మెల్యేకు చీవాట్లు!? 
ఇదిలా ఉంటే.. రాష్ట్ర, జాతీయస్థాయి నాయీ బ్రాహ్మణ, బీసీ సంఘాల నేతలైతే ఎమ్మెల్యేకు నేరుగా ఫోన్‌చేసి చీవాట్లు పెట్టినట్లు సమాచారం. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీ పెనుబాల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే వేగేశనకు నేరుగా ఫోన్‌చేసి నిలదీసిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నాయీ బ్రాహ్మణులను  తిట్టకూడదన్న విషయం తెలియని నువ్వు ఎమ్మెల్యే ఎలా అయ్యావంటూ ఆయన మండిపడ్డారు. బీసీలతో కలిసి వారు ఓట్లేస్తేనే ఎమ్మెల్యే అయ్యావన్నది గుర్తులేకపోతే ఎలాగంటూ నిలదీశారు. 

మీ కులాన్ని సామెతలతో తిట్టిపోస్తే ఊరుకుంటారా? అంటూ ప్రశ్నించారు. మనిషి పుట్టుక నుంచి చావుదాకా నాయీ బ్రాహ్మణులు ఉండాలన్న విషయం తెలుసుకోవాలన్నారు. ఇలా అన్ని వైపుల నుంచి పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తడంతో ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరికి.. నాయీ బ్రాహ్మణులు, బీసీ కులాల ముప్పేట దాడిని తట్టుకోలేక ఎమ్మెల్యే వర్మ దిగొచ్చి వారికి క్షమాపణలు చెబుతూ సాయంత్రం వీడియో విడుదల చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)