Breaking News

అప్పు దొరికితేనే ఆరోగ్యం!

Published on Wed, 03/11/2026 - 02:22

సాక్షి, అమరావతి: చంద్రబాబు ఆయన పుత్రరత్నం, ఇతర వందిమాగధులు తిరగడానికి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం గంటకు లక్షల్లో ఖర్చు పెట్టడానికి ఖజానాలో నిధుల కొరత ఉండదు. ప్రభుత్వం తరపున వాదించేందుకు పెట్టు­కొన్న ప్రత్యేక న్యాయవాదులకు కోట్లలో చెల్లించడా­నికి కూడా నిధుల కొరత ఉండదు. ఎమ్మెల్యేల ఆట­పాట­లు, విందులు, వినోదాలు, యోగా డే, విజన్‌ డాక్యు­మెంట్‌ విడుదల వంటి ఈవెంట్లు.. హంగు­లు, ఆడంబరాలు, ఆర్భాటాలు, ప్రచారాల కోసం ప్రభు­త్వం ఖజా­నా నుంచి నేరుగా రూ. వందల కోట్లు ప్ర­జా­ద­నాన్ని ఖర్చు చేయడానికి  ఏ కొరతా ఉండదు. 

కానీ, రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు సంజీవని వంటి ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల దగ్గరకొచ్చే సరికి ఖజానా ఖాళీగా కనిపిస్తుంది. వారం వారం వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నా, పేదలకు నయా పైసా ఉపయోగం లేదు. రాష్ట్రంలో 1.40 కోట్ల­కు పై­గా పేద, మధ్య తరగతి కుటుంబాలకు నాణ్య­మైన, ఆధునిక వైద్యాన్ని అందించే ఆరోగ్య శ్రీ పథకానికి నిధుల్లేవని బాబు సర్కార్‌ చేతులెత్తేస్తోంది. 

ఆరోగ్య శ్రీ నెట్‌వెర్క్‌ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించడానికి నిధుల్లేవని చెబుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో రూ.3.28 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన బాబు సర్కార్‌.. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల బకాయిలు తీర్చిన పాపాన పోలేదు. ఆ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించాలంటే మరిన్ని అప్పులు చేయాలని చెబుతోంది.

గద్దెనెక్కగానే ఆరోగ్యశ్రీకి గ్రహణం..
2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉండగా ఆరోగ్య శ్రీ పథకానికి నిధులు విదల్చకుండా పేదల ఉసురు తీశారు. 2024లో మళ్లీ చంద్రబాబు గద్దెనె­క్కాక ఈసారి ఏకంగా పథకానికే గ్రహణం పట్టించారు. బీమా పథకం ప్రవేశపెడతామని ప్రక­టించి ఆరోగ్యశ్రీని గాలికి వదిలేశారు. ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడంలేదు. దీంతో రూ.3 వేల కోట్లకు పైగా బ­కాయిలు పేరుకు పోయాయి. ఆస్పత్రుల యాజ­మా­­న్యాలు బిల్లుల కోసం ఎన్నిసార్లు వేడు­కొన్నా స్పందించడంలేదు. 

చివరకు ఆస్పత్రులు పలు దఫా­లు సమ్మెలోకి వెళ్లాయి. దీంతో వారితో చర్చలు జరిపి, బకాయిలను వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ (ఓటీఎస్‌) చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఓటీఎస్‌కు కూ­డా ప్రభుత్వం వద్ద నిధులు లేవని, బ్యాంకుల నుంచి అప్పు చేస్తామని చెప్పింది. దివంగత ముఖ్య­మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని  ప్రారంభించిన నాటి నుంచి పేదలకు చికిత్స చేసిన ఆసుప­త్రులకు నేరుగా ఖజానా నుంచి నిధులు చెల్లింపు జరుగుతోంది. చంద్రబాబు మాత్రం ఎన్నడూ లేన­టు­్టగా ఆస్పత్రుల బకాయిలు చెల్లింపు కోసం ఆరోగ్య శ్రీ ట్రస్టును అప్పుల్లోకి నెట్టే దుష్ట సంప్రదాయానికి తెరలేపారు. 

కానీ, ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు రుణం ఇవ్వడా­నికి బ్యాంకులు అంగీకరించడంలేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ప్రభు­త్వం కొత్త ఎత్తు­గడ వేసింది. ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఏపీ­ఎస్‌ఎఫ్‌సీ)కి రుణాలు సమీకరించి, వాటిని ఆస్ప­త్రులకు మళ్లించా­లని యో­చిస్తున్నామని చెబు­తు­న్నారు. ఆ రుణాన్ని ఆరోగ్య శ్రీ ట్రస్టు చెల్లిస్తామంటు­న్నారు. ఇందు­కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఆస్పత్రు­లకు రుణం రూపంలో బకాయి నిధులు మంజూరు చేయడం కోసం ఓ యాప్‌ను రూపొందిస్తున్నారు. 

ఈ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులకు మొ­త్తం బకా­యిలో కొంత మొత్తం రద్దు చేసి, మిగిలినది మంజూరు చేయనున్నారు. పేద, మధ్య తరగతికి ఉప­యోగపడే పథకం చెల్లింపుల కోసం ప్రత్యేకంగా అప్పులు చేయడం బాబు సర్కారు దివాలాకో­రుత­నానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉత్తుత్తి కేటాయింపులు
బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీ కోసం భారీగా నిధులు కేటా­యిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం కలరింగ్‌ ఇస్తో­ంది. కానీ, ఆస్పత్రులకు మాత్రం బిల్లులు ఇవ్వదు. అంటే ఈ కేటాయింపులన్నీ ఉత్తుత్తివే అని తేలిపో­తోంది. దీంతో ఆస్పత్రుల నిర్వహణ ఖర్చుల కో­సం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. చివ­ర­కు ఆస్పత్రుల యాజమాన్యాలు పథకం సేవలు అందించలేమంటూ బోర్డులు తిప్పేసి, పేద రోగుల నుంచి ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నాయి.

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ..
2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆ­రోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేసింది. 2019లో వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఈ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద కవరయ్యే వ్యాధుల సంఖ్యను 1,059 నుంచి 3,257కు పెంచారు. పథకం పరిమి­తిని రూ.5లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. చంద్రబాబు బావ­మరిది నడిపే బసవ­తా­ర­కం క్యాన్సర్‌ ఆస్పత్రి సహా నెట్‌వర్క్‌ ఆస్ప­త్రులకు చంద్రబాబు పెట్టిన వందల కోట్ల రూపాయల బకాయిలను జగన్‌ ప్రభు­త్వమే చెల్లించింది.

విప్లవాత్మక సంస్కరణ­ల­తో వైఎస్‌ జగన్‌ 2019–24 మధ్య ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. కరోనా వ్యా­ప్తి, లాక్‌డౌన్, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్న­మైన విపత్కర పరి­స్థితులోనూ  నెట్‌వర్క్‌ ఆస్పత్రు­లకు నేరుగా ఖజానా నుంచే బిల్లులు చెల్లించా­రు. ఇలా ఐ­దేళ్ల­లో రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించా­రు. అలాగే ఈ పథకం కింద చికిత్స పొందిన రోగులకు వి­శ్రాంత సమ­యానికి ఆరోగ్య ఆసరా పథకం ద్వారా నెలకు గరిష్టంగా రూ.5 వేల మేర ఆర్థి­క సాయం చేశారు. 

ఆసరా రూపంలో పేద­లకు రూ.1,465 కోట్లు బ్యాంకు ఖా­తా­ల్లో జ­మ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఏడాది­న్నరలోనే పథకాన్ని వెంటిలే­టర్‌ ఎక్కించారు. బిల్లు చెల్లింపులు నిలిపేసి ఆస్పత్రు­లను అ­ప్పు­ల ఊబిలోకి నెట్టేశారు. ఆసరా సాయాన్ని పూర్తిగా ఎత్తేశారు. 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)