Breaking News

హతవిధీ.. ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీకి ఎంత దుర్గతి పట్టింది...

Published on Sat, 03/02/2024 - 12:19

అనకాపల్లి: హతవిధీ.. ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీకి ఎంత దుర్గతి పట్టింది. పార్టీ గ్రాఫ్‌ రోజురోజుకూ పడిపోతుండగా అసలే టీడీపీ పరిస్థితి దీనంగా ఉంది. దానికి తోడు జనసేనతో పొత్తు బెడిసికొట్టి ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా గోడ దూకేస్తున్న దుస్థితి. అందుకే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ‘కొత్త’ నాటకానికి తెర తీశారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు.. (పాత సీసాలో కొత్త సారా అనాలేమో) ఇప్పటికే పార్టీలో ఉన్న వారికి కండువాలు కప్పి కొత్తగా చేరినట్టు బిల్డప్‌ ఇస్తున్నారు.

బుధవారం నాటి నాటకంలో పాత్రధారులు పాత కాపులే అన్న సంగతి తెలియడంతో అందరూ విస్తుపోతున్నారు. సిహెచ్‌.నాగాపురం గ్రామంలో అయ్యన్నపాత్రుడి సమక్షంలో వైఎస్సార్‌సీపీ నుంచి 10 మంది టీడీపీలో చేరినట్టు ప్రచారం చేశారు. తీరా చూస్తే టీడీపీ కండువాలు కప్పుకున్న వారంతా గతంలో తమ పార్టీకి చెందిన వారు కావడంతో స్థానిక తెలుగుదేశం నేతలు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది.

నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక వేస్తున్న ఎత్తులతో నవ్వువులపాలయ్యామని పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. సిహెచ్‌.నాగాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులే మళ్లీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో పార్టీలో చేరడం చాలా సిగ్గుచేటుగా ఉందని నాగాపురం సర్పంచ్‌ యలమంచిలి రఘురాం ఎద్దేవా చేశారు.

ఆయన గురువారం విలేకర్లుతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఉప్పులూరి రంగా, కులం రాము, కంకిపూడి మంగరాజు, చంటిబాబు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, వీరితో పాటు మరో నలుగురు 2019లో అయ్యన్నపాత్రుడు గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులేనని తెలిపారు. వీరికే మళ్లీ టీడీపీ కండువాలు కప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఉప సర్పంచ్‌ సుబ్రమణ్యం తదితర్లు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)