Breaking News

స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు?

Published on Sat, 06/15/2024 - 05:08

సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి అసెంబ్లీ స్పీకర్‌ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీలో సీనియర్‌ నాయకుడు అవడంతోపాటు గతంలో పలుసార్లు మంత్రిగా పని చేసిన అయ్యన్నకు మంత్రివర్గంలో కచ్చితంగా చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే సీఎం చంద్రబాబు ఆయనకు పదవి ఇవ్వలేదు. 

ఈ నేపథ్యంలో ఆయనకు స్పీకర్‌ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఆయన చంద్రబాబును కలిశారు. ఈ సమయంలో స్పీకర్‌ పదవి ఇస్తానని చంద్రబాబు ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.  

టీడీపీ నేతలకు గవర్నర్‌ పదవులు? 
ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉండడంతో ఒకటి, రెండు గవర్నర్‌ పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం. టీడీపీలో సీనియర్‌ నేతలు అశోక్‌ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లను గవర్నర్‌ పదవుల కోసం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

యనమల రామకృష్ణుడు శుక్రవారం చంద్రబాబును కలవగా ఈ విషయం చెప్పి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి పదవి ఆశించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను శాసన సభలో చీఫ్‌ విప్‌ పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష 
నీటి పారుదల శాఖపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష చేశారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన సమీక్షలో పోలవరం సహా వివిధ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో చర్చించారు.  సోమవారం పోలవరం ప్రాజెక్టును  సందర్శిస్తారని,  ఆ తర్వాత మంత్రివర్గ , అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

ఆరుద్ర కుమార్తె వైద్యానికి రూ.5 లక్షలు! 
శుక్రవారం సచివాలయంలో కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన కుమార్తెతో కలిసి సీఎం చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరింది. స్పందించిన చంద్రబాబు ఆమె కుమార్తె ఆరోగ్య ఖర్చుల కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం, ప్రతి నెలా రూ.10 వేల పింఛను ఇప్పిస్తానని హామీ  ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)