Breaking News

అది రాయి దాడి కాదు.. పవన్‌ అభిమానినే చితకబాదిన జనసైనికులు

Published on Mon, 04/15/2024 - 08:51

తెనాలి రూరల్‌: జనసేన అధినే పవన్‌కళ్యాణ్‌ పర్యటనలో జన సైనికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్‌ అభిమాని అయిన ఓ కాపు యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పవన్‌ కల్యాణ్‌పై రాళ్లు విసిరాడని పుకారు చెలరేగడంతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు.

బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన సరిగిరి దిలీప్‌నాయుడు తెనాలిలో ఆదివారం సాయంత్రం జరిగిన పవన్‌కళ్యాణ్‌ రోడ్‌ షో, బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చాడు. ఇక్కడి సుల్తానాబాద్‌లోని హెలీప్యాడ్‌ నుండి పవన్‌ కల్యాణ్‌ కొంత దూరం కారు నుండి అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చి వారాహి వాహనంలోకి మారారు. ఈ మార్గంలోనే ఉషోదయ కళ్యాణమండపం వద్ద దిలీప్‌ పవన్‌ రాక కోసం వేచి ఉన్నాడు. 

పవన్‌ కల్యాణ్‌ అటుగా వెళ్లగానే ఓ యువతితో దిలీప్‌ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె తండ్రి అతనిపై దాడి చేశాడు. పక్కనే ఉన్న జన సైనికులు కలుగజేసుకుని దాడి చేస్తుండడంతో సమీపంలోని చెట్టు ఎక్కాడు. అయినా జనసైనికులు కిందకు లాగడంతో తనను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న రాయి తీసుకున్నాడు. రాళ్లతో దాడి చేస్తున్నాడని జనసైనికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరి కొందరు పవన్‌ కల్యాణ్‌పై రాళ్లు వేశాడని కేకలు మొదలు పెట్టారు. 

యువకులు పెద్ద ఎత్తున గుమికూడి దిలీప్‌పై దాడి చేస్తున్న క్రమంలో కల్యాణమండపం ఆవరణలోకి పరుగెత్తాడు. వెంబడించిన జనసైనికులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కళ్యాణ మండపం సమీపంలోనే విధుల్లో ఉన్న గుంటూరు స్పెషల్‌బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, మరో మహిళా ఎస్‌ఐ, తెనాలి రూరల్, త్రీ టౌన్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు శివ, తిరుమలరావు, ఇతర సిబ్బంది హుటాహుటిన దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లారు. బాధితుడు దిలీప్‌ను పొలీసులు చుట్టముట్టి అతని ప్రాణాలను రక్షించారు. పవన్‌ కల్యాణ్‌ అభిమానినైన నేను ఆయనపై రాళ్లు ఎందుకు వేస్తానంటూ బాధితుడు వాపోయాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. వివాదానికి కారణమేంటన్నదీ విచారిస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)