Breaking News

వీధికుక్కల ప్రచారం పట్టించుకోను: విక్రమ్‌రెడ్డి

Published on Fri, 03/31/2023 - 11:00

సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీపై అసంతృప్తితో పార్టీ మారబోతున్నారంటూ పచ్చ బ్యాచ్‌ చేస్తున్న ప్రచారంపై ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. వీధికుక్కల ప్రచారం పట్టించుకోనన్న ఆయన..  సీఎం జగన్‌ వెంటే తన ప్రయాణమని,  వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్నిస్థానాలను కైవసం చేసుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. 

శుక్రవారం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘పార్టీ మారబోతున్నట్లు వస్తున్న ప్రచారం ఉత్తదే. వీధి కుక్కల ప్రచారం నేను పట్టించుకోను. బాబాయ్‌ చంద్రశేఖర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ పార్టీని, అలాగే ఇంటి పేరు వదిలేసి వెళ్తే ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలిసి వస్తుంది. పార్టీ లైన్‌ దాటితే ఎవరిపైన అయినా చర్యలు తప్పవ’’ని విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. 

అలాగే మేకపాటి కుటుంబం ఎప్పుడూ సీఎం జగన్‌తోనే ఉంటుందని, ఆయన వెంటే నడుస్తుందని ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఇప్పుడు.. ఎప్పుడూ.. సీఎం జగన్ తోనే మా ప్రయాణం. ఆయన్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకే టీడీపీ తన అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని ప్రచారం చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా ఎవరు కలిసొచ్చినా సరే.. ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్న సీఎం జగన్‌ స్థానాన్ని చెరపలేరు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలితం లేదన్నారాయన. ఇక.. జిల్లా పరిణామాలపైనా స్పందించిన మేకపాటి విక్రమ్‌రెడ్డి.. 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని పదికి పది స్థానాలు గెలిచి సీఎం వైఎస్‌ జగన్‌కు కానుకగా ఇస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: చంద్రశేఖర్‌రెడ్డి.. నువ్వు మళ్లీ గెలుస్తావా?

Videos

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం