Breaking News

అమ్మా నీ బిడ్డ.. జ్ఞానేశ్వరి ఇంటి వద్ద జ్యోతిష్యుడి హల్‌చల్‌

Published on Thu, 06/18/2026 - 14:03

సాక్షి, కాకినాడ: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో కేసు మిస్టరీ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో ఓ జ్యోతిష్కుడు హల్‌ చల్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ గద్వాల్ నుంచి వచ్చినట్లు చెప్పుకున్న ఓ అజ్ఞాత వ్యక్తి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద హడావిడి చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను జ్యోతిష్యుడినని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, ‘‘పాప భూదేవతలో ఉంది.. త్వరలో తిరిగి వస్తుంది’’ అంటూ చెప్పాడట. అదే సమయంలో.. కుటుంబ సభ్యులను భయపెట్టేలా, అలాగే ఆశ కలిగించేలా మాటలు చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జ్ఞానేశ్వరి ఇంటి వద్ద గత రెండు రోజులుగా అతను అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో అతని ప్రవర్తనపై అనుమానాలు పెరిగాయి. “అమ్మా నీ బిడ్డ ఎక్కడ ఉంది చెప్పు” అంటూ జ్యోతిష్యుడు తరహాలో వ్యాఖ్యలు చేస్తూ కుటుంబాన్ని మరింత భావోద్వేగానికి గురిచేసినట్లు సమాచారం. దీంతో ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి తల్లి భవాని, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకోకుండా ఇలా భయపెట్టే మాటలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది.

మరోవైపు, యువతి అదృశ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జ్యోతిష్యుడి హావభావాలు, అతని నేపథ్యంపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఒక్కసారిగా జ్యోతిష్యుడి హడావిడితో కొత్త మలుపు తిరిగి, స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)