Breaking News

పోలీసుల గురించి మాట్లాడితే.. దూల తీరుస్తాం..!

Published on Tue, 09/30/2025 - 02:31

ఏలూరు టౌన్‌: పోలీసులపై విమర్శలు చేస్తే కేసులు పెట్టి.. దూల తీరుస్తామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (ఏఎస్పీ) నక్కా సూర్యచంద్రరావు వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును బెదిరించారు. ఏలూరులో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యచంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.  ఈ నెల 5న కైకలూరు మండలం దానగూడెంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. 

ఈ ఘటనపై పోలీస్‌ అధికారులు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విషం చిమ్మడమే లక్ష్యంగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని వివాదాస్పద వ్యాఖ్యలు, దీనిపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలను ఈ నెల 26న జరిగిన విలేకరుల సమావేశంలో దూలం నాగేశ్వరరావు ఖండించారు.  ఈ క్రమంలో కామినేని ఒత్తిడులకు లొంగకుండా కొందరు పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 

దళితులపై అన్యాయంగా హత్యాప్రయత్నం చేసిన కేసులో కామినేనికి నచి్చనట్లుగా,  ఆయన చెప్పిన విధంగా కేసులు రాయలేదని, అరెస్ట్‌ చేయలేదని టౌన్‌  సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణను వీఆర్‌కు పంపించారని తెలిపారు. ఎమ్మెల్యే  మనిషిగా పేరొందిన రూరల్‌ సీఐ రవికుమార్‌  దీనంతటకీ కారణమని కూడా విమర్శించారు. తనకు కావాల్సిన రవికుమార్‌ వంటి వారిని కాపాడుకుంటూ, నిజాయితీగా పనిచేసే కృష్ణ అనే ఇన్‌స్పెక్టర్‌ను వీఆర్‌కు పంపించారని పేర్కొన్నారు. 

సమయం వస్తుందన్న ఏఎస్పీ.. 
ఈ అంశాలను తాజాగా ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యచంద్రరావు ప్రస్తావిస్తూ, ‘నోటి దూలెక్కి మాట్లాడితే, దూల తీర్చేసే సమయం వస్తుంది’ అని పేర్కొన్నారు. పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ  సాధారణ బదిలీల్లో భాగంగానే సీఐ కృష్ణను బదిలీ చేశారని చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)