Breaking News

బాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు

Published on Wed, 09/27/2023 - 03:45

సాక్షి, అమరావతి: యుద్ధభేరి పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు నుంచి చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు టీడీపీ శ్రేణులు ఇటీ­వల సాగించిన విధ్వంసంపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోరుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటి­షన్‌పై వాదనలు మంగళవారం ముగి­శాయి. ఇరు­పక్షాల వాద­నలు విన్న న్యాయ­మూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి తీర్పును రిజర్వ్‌ చేశారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధా­కర్‌­రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అసలు ఈ బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హతే లేదన్నారు. మరో కేసులో అరెస్టయినందున ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించడానికి వీల్లేద­న్నా­రు.

పలు కేసులు ఒకే పోలీస్టేషన్‌లో నమో­దై, వాటిని ఒకే అధికారి దర్యాప్తు చేస్తుంటే అప్పుడు డీమ్డ్‌ (అన్నీ కేసుల్లో అరెస్ట్‌ అయి­నట్లు) అరెస్ట్‌ వస్తుందని, వేర్వేరు కేసులు, వేర్వేరు దర్యాప్తు అధికారులున్నప్పుడు అది డీమ్డ్‌ అరెస్ట్‌ కిందకు రాదని స్పష్టంచేశారు. డీమ్డ్‌ అరెస్ట్‌ అయితే  పీటీ వారెంట్‌తో పనే­ముంటుందని ప్రశ్నించారు. చట్ట ప్రకారమే పీటీ వారెంట్‌ దాఖలు చేశామన్నారు. అసలు చంద్రబాబు ప్రోద్బలంతోనే అంగళ్లు ఘటన జరిగింద­న్నారు. అంగళ్లు వద్ద మొదలైన టీడీపీ శ్రేణుల విధ్వంసం చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు కొనసాగిందని చెప్పారు.

మాజీ ముఖ్య­మంత్రిగా, పార్టీ అధినేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబే దగ్గరుండి శ్రేణులను రెచ్చగొట్టారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోర్టును కోరారు. మారణహోమం సృష్టించడం ద్వారా శాంతిభద్రతల సమస్య లేవనెత్తాలన్నదే చంద్రబాబు వ్యూహమన్నారు. అంతిమంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర పన్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసు­కుని చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేయా­లని ఆయన కోరారు.

అంతకు ముందు చంద్ర­బాబు తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ మరో కేసులో అరెస్టయి జైలులో ఉన్నందున, ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించాల్సి ఉంటుందన్నారు. అందుకే బెయిల్‌ పిటిషన్‌ వేశామని తెలిపారు. అధికార పార్టీ నేతలు చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారని, ఆ దాడి నుంచి ఆయన్ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షించారని తెలిపారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ మంజూరైందని చెప్పారు. 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)