Breaking News

‘గ్రూప్స్‌’ ఫలితాలపై నీలినీడలు!

Published on Tue, 01/13/2026 - 04:45

సాక్షి, అమరావతి:  గ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థులతో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చెలగాటమాడుతున్నాయి. తాము రేయింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసినా ఫలితాలు ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు మొగ్గు చూపకపోవడం.. ఫలితాలిస్తామని ఏపీపీఎస్సీ పైకి చెబుతున్నప్పటికీ అది ఎప్పుడో తెలీక అభ్యర్థులు రెండింటి మధ్య నలిగిపోతున్నా­రు. ఎందుకంటే.. ఫలితాలు ప్రకటించుకోవచ్చని న్యాయస్థానం చెప్పినా మరికొంత సమయం పడుతుందని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో అభ్యర్థుల్లో కలవరం మొదలైంది.  

గత ప్రభుత్వం 2023 డిసెంబరులో ఇచ్చిన గ్రూప్‌–­2 నోటిఫికేషన్‌కు మూడునెలల్లో ప్రిలిమ్స్‌ పూర్తిచేసి మేలో మెయిన్స్‌ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ప్రకటించారు. అయితే, సార్వత్రిక ఎన్నికల కోడ్‌ రావ­డంతో పరీక్షలు నిర్వహించొద్దని నాటి ప్రతిపక్ష నేత­లు హైకోర్టులో కేసులు వేయించారు. అనంతరం 2024 జూన్‌లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

కానీ, గత ప్రభుత్వంపై కక్షగట్టి హైకోర్టులో పిటిషన్లు వేయించిన ప్రస్తుత అధికార పక్షం.. ఇప్పుడు కూడా అదే పంధాను అనుసరించడం చూస్తుంటే 2026లో కూడా గ్రూప్‌–2 ఫలితాలు వస్తాయన్న ఆశలేదని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పోర్ట్సు కోటాతో ఫలితాలను ముడిపెట్టి అడ్డుపడుతోందని వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఫలి­తాలు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరసనకు యతి్నంచిన అభ్యర్థులను కార్యాలయానికి రాకుండానే బెదిరించి వెనక్కి పంపేసినట్లు తెలిసింది.  

మూడు నెలల్లో ప్రిలిమ్స్‌.. ఏడాది తర్వాత మెయిన్స్‌.. 
నిజానికి.. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 2023 డిసెంబరులో 905 పోస్టులతో గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రిలిమ్స్‌ 2024 ఫిబ్రవరి 25న నిర్వహించింది. మెయిన్స్‌ అదే ఏడాది మే/జూన్‌లో జరుగుతాయని ఏపీపీఎస్సీ షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే, ఫిబ్రవరిలో ప్రిలిమ్స్‌ నిర్వహించి నెలరోజుల్లో ఫలితాలు ప్రకటించారు. అనంతరం 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసి మేలో మెయిన్స్‌కు ఏర్పాట్లుచేశారు. అలాగే, గ్రూప్‌–­1కి కూడా 2023 డిసెంబరులోనే దాదాపు 90 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చి మార్చిలో ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న అక్కసుతో కొందరు టీడీపీ నాయకులు అభ్యర్థులతో హైకోర్టులో పిటిషన్లు వేయించారు.

ముఖ్యంగా గ్రూప్‌–1పై ఈ కేసులు వేయడంతో పాటు గ్రూప్‌–2పైనా అదనపు పిటిషన్లు వేయించారు. దీంతో 2024 మే, జూన్‌లో జరగాల్సిన మెయిన్స్‌కు బ్రేకులు పడ్డాయి. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడడంతో అడ్డంకులు తొలగిపోతాయని అభ్యర్థులు ఆశించారు. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే ఏపీపీఎస్సీని అస్తవ్యస్థం చేసింది. అనేక రకాల డ్రామాల నడుమ 2025 ఫిబ్రవరి 23న గ్రూప్‌–2 మెయిన్స్‌.. నిర్వహించి గతనెలలో సరి్టఫికెట్ల పరిశీలన, కంప్యూటర్‌ నైపుణ్య పరీక్షలు పూర్తిచేశారు. అదే ఏడాది మేలో గ్రూప్‌–1 మెయిన్స్‌ నిర్వహించారు.  

హైకోర్టు అడ్డంకులు తొలగినా సరే..  
ఇక గ్రూప్‌–1, 2 ఫలితాల విడుదలకు హైకోర్టులో అడ్డంకులు తొలగినప్పటికీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ రెండూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్సు కోటా పోస్టులను పక్కనబెట్టి, మిగిలిన పో­స్టులకు ఫలితాలు ప్రకటించుకోవచ్చని హైకోర్టు స్ప­ష్ట­తనిచ్చింది. అయితే, ఫలితాలు మరింత  ఆలస్యమవు­తాయని ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించడం అభ్యర్థు­ల్లో ఆందోళనను రెట్టింపు చేసింది. ఇప్పుడు ఫలితా­లు ప్రకటించకపోతే మెయిన్స్‌ రాసి సీపీటీకి ఎంపిక­గాని అభ్యర్థులు మళ్లీ డివిజనల్‌ బెంచ్, సు­ప్రీంకోర్టు­కు వెళ్తే ఈ నోటిఫికేషన్‌ పూర్తికావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. ఈ నోటిఫికేషన్‌ పూర్తికాకుండా కొత్త జాబ్‌ కేలండర్‌ ఇవ్వడం కుదరదని ప్రభు­త్వం పరోక్షంగా చెబుతోంది. దీంతో ఎంపికగాని అభ్యర్థులు మరోసారి డివిజనల్‌ బెంచ్‌కు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.  

జగన్‌ పాలనలో దేశంలోనే నం.1గా ఏపీపీఎస్సీ.. 
ఇదిలా ఉంటే.. వైఎస్‌ జగన్‌ హయాంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్విస్‌ కమిషన్ల పనితీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్లు వివాదాల్లో చిక్కుకోగా.. వివాదరహిత కమిషన్‌గా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. కానీ, ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఏపీపీఎస్సీని తిరిగి వివాదాల్లోకి నెట్టి నిరుద్యోగ యువత ఆశలను ఛిద్రం చేస్తోంది. 2018 డిసెంబరులో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చి ఒక్కదానికి కూడా పరీక్షలు నిర్వహించలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో 2018 నాటి పరిస్థితే కనిపిస్తుండడం యువతను ఆందోళనకు గురిచేస్తోంది.   

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)