amp pages | Sakshi

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే..

Published on Thu, 02/17/2022 - 21:00

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్-19 నిబంధ‌న‌లను స‌డ‌లించిన నేప‌థ్యంలో త్వ‌ర‌లో కోవిడ్‌కు ముందులాగా శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు పున‌రుద్ధ‌రించ‌డంతో పాటు, స‌ర్వ‌ ద‌ర్శ‌నం, శీఘ్ర ద‌ర్శ‌నం టికెట్ల సంఖ్య‌ను క్ర‌మంగా పెంచాల‌ని బోర్డు తీర్మానించిన‌ట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో  టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్  వివరాలు తెలిపారు.

రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు టీటీడీ ఆధ్వ‌ర్యంలో రూ.230 కోట్ల‌తో శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్లల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రి భ‌వ‌నాల‌ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణాలు రెండు సంవ‌త్స‌రాల్లోపు పూర్తి చేయాల‌ని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లో సీఎం జగన్‌తో భూమిపూజ చేయించి టెండ‌ర్ల ప్ర‌క్రియ ప్రారంభిస్తామన్నారు. శ్రీ ప‌ద్మావ‌తి హృద‌యాల‌యంకు అవ‌స‌ర‌మైన వైద్య ప‌రిక‌రాల కోనుగోలుకు టీటీడీ జెఈవో ఆధ్వ‌ర్యంలో నిపుణుల క‌మిటీని పాలకమండలి ఏర్పాటు  చేసిందన్నారు.

ప‌ద్మావ‌తి హృద‌యాల‌యం ప్రారంభించి 100 రోజుల‌లో 100 అప‌రేష‌న్లు నిర్వ‌హించాం. తిరుప‌తిలో గ‌రుడ వార‌ధి నిర్మాణం కోసం ఏడాదిలో ద‌శ‌ల వారీగా టీటీడీ వాటా నుండి రూ.150 కోట్లు చెల్లించి, వ‌చ్చే ఏడాది డిసెంబ‌రు నాటికి శ్రీ‌నివాస సేతు ఫ్లైఓవ‌ర్‌ను ప్ర‌జ‌ల‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. రూ.2.73 కోట్ల‌తో స్విమ్స్‌కు కంప్యూట‌ర్లు కోనుగోలు చేసి పూర్తి స్థాయిలో కంప్యూట‌రీక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపింది. టీటీడీ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లకు కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో న‌గ‌దు ర‌హిత వైద్యం అందించ‌డానికి రూ.25 కోట్లు నిధి ఏర్పాటు. తిరుచానూరు స‌మీపంలోని శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యంను బాలాజి జిల్లా క‌లెక్ట‌రెట్‌గా రాష్ట్ర ప్ర‌భుత్వానికి టిటిడి నిబంధ‌న‌ల మేర‌కు లీజుకు ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకొన్నారు.

తిరుమ‌ల మాతృశ్రీ త‌రిగొండ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో స్టీమ్ ద్వారా అన్న‌ప్ర‌సాదాల త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే. టీటీడీ గ్యాస్‌, డిజిల్ ద్వారా కేజి స్టీమ్ త‌యారీకి 4 రూపాయ‌ల 71 పైస‌లు ఖ‌ర్చు చేస్తోంది. ఎన్‌ఈడీసీఏపీ వారు సోలార్ సిస్ట‌మ్ ఆర్‌ఈఎస్‌సీవో మోడ‌ల్ స్టీమ్‌ను కేజి 2 రూపాయ‌ల 54 పైస‌లతో 25 సంవ‌త్స‌రాల పాటు స‌ర‌ఫ‌రా చేయ‌డానికి టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. త‌ద్వారా టీటీడీకి దాదాపు రూ.19 కోట్లు ఆదాయం చేకూరుతుంది. తిరుమ‌ల‌లో రాబోవు రోజుల్లో హోట‌ళ్ళు, ఫాస్టు ఫుడ్ సెంట‌ర్లు లేకుండా చేసి అన్ని ముఖ్య కూడ‌ళ్ళ‌లో ఉచితంగా అన్న‌ప్ర‌సాదాలు అందించాల‌ని నిర్ణ‌యం. అత్యున్న‌త స్థాయి నుండి సామాన్య భ‌క్తుడి వ‌ర‌కు ఒకే ర‌క‌మైన ఆహారం అందించాల‌ని తీర్మానం చేసింది పాలకమండలి. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఇబ్బంది ప‌డే వ్యాపారుల‌కు ఇత‌ర వ్యాపారాలు చేసుకోవ‌డానికి లైసెన్స్‌లు మంజూరు చేయాల‌ని టీటీడీ అధికారులకు ఆదేశించారు.

తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద సైన్స్‌సిటి నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎక‌రాల భూమిలో 50 ఎక‌రాలు వెన‌క్కు తీసుకుని ఆధ్యాత్మిక న‌గ‌రం నిర్మించాల‌ని ,ఈ ప‌నుల‌కు త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రితో శంకుస్థాప‌న‌ చేస్తారని చైర్మన్ తెలిపారు. తిరుమ‌ల నాద‌నీరాజ‌న మండ‌పం షెడ్డు స్థానంలో శాశ్వ‌త మండ‌పం నిర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అన్న‌మ‌య్య మార్గం త్వ‌ర‌లో భ‌క్తుల‌కు అందుబాటులోకి తేవ‌డానికి ఇప్పుడు ఉన్న మార్గాన్ని అభివృద్ధి చేయాల‌ని తీర్మానించింది పాలకమండలి. అట‌వీ శాఖ అనుమ‌తులు ల‌భించిన త‌రువాత పూర్తి స్థాయిలో అభివృద్ధి ప‌నులు చేప‌డతామని చైర్మన్ పేర్కొన్నారు.

రూ.3.60 కోట్ల‌తో టీటీడీ ఆయుర్వేద ఫార్మ‌శీకి ప‌రిక‌రాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంచాల‌ని తీర్మానించారు. శ్రీ‌వారి ఆల‌య మ‌హ‌ద్వారం, బంగారువాకిలి, గోపురంకు బంగారు తాప‌డం చేయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. గోపురాల బంగారు తాప‌డం విష‌యంపై ఆగ‌మ పండితుల‌తో చ‌ర్చించి క్రేన్ స‌హ‌యంతో తాప‌డం ప‌నులు పూర్తి చేయించే సాధ్యాసాధ్యాలు ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు ఆదేశం జారీచేసారు చైర్మన్. సామాన్య భ‌క్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధ‌ర‌లు పెంచిన‌ట్లు మీడియాలో జ‌రిగిన ప్ర‌చారం ఆవాస్త‌వమని, ధర పెంచే ఆలోచన మా పాలకమండలికు లేదని స్పష్టం చేశారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)