Breaking News

అడక్కుండానే హామీ ఇచ్చి.. అడుక్కునేలా చేస్తున్నారు

Published on Wed, 08/21/2024 - 05:58

సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు):  అడక్కుండానే వార్డు, గ్రామ వలంటీర్లకు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు.. వాటిని అమలు చేయకుండా వలంటీర్లను అడుక్కునేలా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ వలంటీర్ల యూనియన్‌ మండిపడింది. ఆంధ్రప్రదేశ్‌ వలంటీర్ల యూనియన్‌ రాష్ట్రస్థాయి సదస్సు ఎంబీ భవన్‌లో మంగళవారం జరిగింది. వివిధ జిల్లాల నుంచి తరలివచి్చన యూనియన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. వలంటీర్లు ఎవరూ అడగకపోయినా సీఎం చంద్రబాబే వలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 

కానీ, అధికారంలోకి వచ్చాక మూడు నెలలుగా వలంటీర్లకు జీతాలు చెల్లించకుండా తమ పొట్టకొడుతున్నారని వాపోయారు. ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విధుల్లో తాము పాల్గొన్నామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అడగకుండానే హామీ ఇచ్చి.. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు వలంటీర్లను ఏదో ఒక పార్టీ వారిగా ముద్రవేసి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్లం కాదన్నారు. 

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన బకాయిలు చెల్లించి, నెలవారీ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని కోరుతూ సదస్సు తీర్మానించింది. రాజీనామా చేసిన వలంటీర్లను కూడా మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వలంటీర్లకు ప్రత్యేక వెయిటేజీ ప్రకటిస్తూ, అర్హతలను బట్టి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మరో తీర్మానం చేశారు.

సీఐటీయూ మద్దతు 
వలంటీర్ల డిమాండ్లకు సీఐటీయూ మద్దతు తెలిపింది. వలంటీర్ల సమస్యల పరిష్కార సాధనలో సీఐటీయూకు అనుబంధంగా యూనియన్‌ను ఏర్పాటు చేసింది. సీఐటీయూ కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామ, వార్డు వలంటీర్లను విధుల్లో కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, రూ.10 వేల వేతనం చెల్లిస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు. 

ఈ సందర్భంగా యూనియన్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా హుమయూన్‌ బాషా, ఉపాధ్యక్షునిగా వెంకటసుబ్బయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా దీప్తి, కోశాధికారిగా హేమంత్‌ను ఎన్నుకున్నారు. సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు కె.ఉమామహేశ్వరరావు, ఆర్‌వీ నరసింహరావు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)