Breaking News

నాడు ఆరోగ్య బీమాలో ఏపీ టాప్‌

Published on Tue, 06/16/2026 - 06:07

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించడంతో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2023–24 స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో 60.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించగా, ఆంధ్రప్రదేశ్‌లో 91.9 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించినట్లు సర్వే పేర్కొంది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాలు ఇంత పెద్ద సంఖ్యలో కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించలేదని సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే 90.5 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించినట్లు సర్వే తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైఎస్‌ జగన్‌ అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కటుంబాలకు ఆరోగ్యానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం వార్షికాదా­య పరిమితిని పెంచా­రు. వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం అధికారంలోకి వ­చ్చాక రూ.5 లక్షల లో­పు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రంలోని 91.9 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కలిగింది. గ్రామీ­ణ ప్రాంతాల్లో 95.1 శాతం కటుంబాలకు, పట్టణాల్లో 85.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించినట్లు సర్వే పేర్కొంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)